ఒక పార్టీలో ఉంటేనే ఆశావహులు ఎందరో ఉంటారు. ఆ తలకాయ నొప్పి అంతా ఇంతా కాదు. ఇక నాలుగైదు పార్టీలు కలసి కలగూర గంపను తలకెత్తుకుంటే ఆ వ్యవహారం చాలా గొప్పగా ఉంటుంది. పదవుల కోసం పరుగు పందేలు, ఒకరిని ఒకరు ఓడించుకోవడాలు, తొలగించుకోవడాలు రాజకీయం చాలా రంజుగా సాగుతుంది. దేశంలో చాలా కాలం సాగిన ఈ కధ ఇపుడు తెలంగాణాలో చూడబోతారా


కాంగి రేసులో  ఎందరో :


ముఖ్యమంత్రుల  విషయానికి వస్తే కాంగ్రెస్ ఎపుడూ వెనక్కు తగ్గదు. ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ సీఎం క్యాండిడేట్ నే. నిన్న కాక మొన్న కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ  ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య్య, నల్గొండలో కోమటి రెడ్డి బ్రదర్స్, మహిళా నాయకురాలు డీక అరుణా. రాజకీయ కురు వ్రుధ్ధుడు జైపాల్ రెడ్డి, జానా రెడ్డి ఇలా చాలా మంది కనిపిస్తున్నారు. మరి చాన్స్ కనుక వస్తే ఆరు నెలల వంతునో ఏడాదికి ఒకరి వంతునో వీరంతా సీఎం పీఠాన్ని పంచుకుంటారేమోనని సెటైర్లు పడుతున్నాయి.


కూటమి నుంచి :


ఈసారి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంలేదు. మహా కూటమి కట్టింది. పక్కనే ఉన్న కర్ణాటకలో ఎక్కువ సీట్లు వచ్చినా 38 సీట్లు తెచ్చుకున్న కుమారస్వామికి పట్టం కట్టి పక్కన కూర్చున్న కధను కూటమి నేతలు గుర్తుకు తెస్తే ఇక్కడ కూడా వాళ్ళకు సీఎం అయ్యే చాన్స్ ఎక్కువగానే ఉంటుంది. అలా చూసుకుంటే కూటమి కన్వీనర్ కోదండరాం మాస్టారు ఉండనే ఉన్నారు. ఇక చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ ఉంటుంది. మరి ఆ విధంగా చూసుకుంటే కూటమిలో సీఎం అయ్యే వారిని తక్కువ చేయడానికి లేదు. దీనినే ఇపుడు టీయారెస్ తెలివిగా ఎన్నికల్లో వాడుకుంటోంది. కూటమి వస్తే కుమ్ములాటే అన్న ఒక్క అస్త్రంతో మొత్తం పరిస్థితిని తనకు అనుకూలం చేసుకునేలా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: