పవన్ కళ్యాణ్ మాటలు ను ఇపుడూ తన అభిమానులే నమ్మే పరిస్థితి లేదని చెప్పాలి. ఒక సారేమో ఎన్నికల్లో పోటీ చేస్తాము అంటారు మరో సరి డబ్బులు లేవంటాడు. అయితే తెలంగాణలో అనుకోకుండా ముందస్తుగా ఎన్నికలు రావడంతో పోటీ చేసే అంశం పై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నామని గతంలో పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో మీడియా సమావేశాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సరిపడినంత సమయం లేనందున అక్కడ పోటీ చేసే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నామని కూడా ఆయన గతంలోనే వెల్లడించి తాజాగా ప్రకటన చేశారు. అయితే నిజంగా లోక్ సభ ఎన్నికల బరిలో జనసేనాని దిగనున్నారా? అనేది సందేహంగా మారింది.

Image result for pavan kalyan janasena

జనసేనాని గురించి ఇలాంటి సందేహం రావడానికి ఆయన ``ట్రాక్ రికార్డ్`` కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు విశ్లేషిస్తే - ముందుగా తెలంగాణ అంశాన్నే చూసుకుంటే....దాదాపుగా రెండేళ్ల కిందట జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో తాము బరిలో దిగడం లేదని ప్రకటించి పార్టీ నేతలకు షాకిచ్చారు పవన్ కళ్యాణ్. ఇందుకు ఆయన చెప్పిన కారణం డబ్బులు లేకపోవడం! ఇప్పుడు చెప్తున్నది సిద్ధం కావడం.

Image result for pavan kalyan janasena

ముందస్తు ఎన్నికలకు తాము ప్రణాళికబద్ధంగా సిద్ధం కాకపోవడం వల్ల బరిలో లేమంటున్న పవన్ లోక్ సభ ఎన్నికల నాటికి అదే సమయంలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని మర్చిపోయారా అనేది ప్రశ్న. ఒకవేళ ఏపీ ఎన్నికలు సాకుగా చూపి ఆ సమయంలోనూ బరిలో దిగకుండా ఉంటారా అని చర్చించుకుంటున్నారు.ఇదిలాఉండగా - ఏపీలో పవన్ పోటీపై సైతం ఇదే ప్రచారం జరుగుతోంది. గతంలో అనంతపురం జిల్లాలో సహా పలు జిల్లాల్లో పర్యటన సందర్భంగా తాను రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం తరఫునే పోటీ చేస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా ఓ నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రకటించిన పవన్...వారిలో ఉత్సాహాన్ని కలిగించారు. అనంతరం ఏ నియోజకవర్గాన్ని ఆయన వెల్లడించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: