భారత దేశం ఎన్నో రాష్ట్రాల కలయిక. ఇది అందమైన పొందిక. ఈ దేశానికి బలమైన రాజ్యాంగం అండగా ఉంది. దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన అధికారాలు, నిధులు, విధులు అన్నీ కూడా రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించబడి ఉన్నాయి. అటువంటి ఈ దేశాన్ని రాజకీయ కారణాలతోనో, మరే ఉద్దేశ్యాలతోనో ఇబ్బంది పెట్టడం తగదు. 


బాబు నోట ఆ మాట:


రాజకీయాలకు కొత్త కాబట్టి పవన్ కళ్యాణ్ అప్పట్లో ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ విడదీసి మాట్లాడితే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, పైగా పవన్ ఏ బాధ్యాతాయుతమైన పదవిలో కూడా లేరు. అయినా సరే అక్కడక్కడ ఆక్షేపణలు వచ్చాయి. మరి నలభయ్యేళ్ళ అనుభవం ఉండి, పలు మార్లు ముఖ్యమంత్రిత్వం నెరుపుతున్న చంద్రబాబు నోటి వెంట ఈ తరహా మాటలు రావడం బాధాకరమే. బాబు తాజాగా ఉత్తరాది, దక్షిణాది అంటూ వేరు చేస్తూ నెల్లూరు మీటింగులో విమర్శలు చేశారు. ఇది కచ్చితంగా బాధ్యతారాహిత్యం కిందకే వస్తుందని మేధావులు అంటున్నారు.


అలా అయితే పెను ముప్పే :


భారత దేశానికి బలమైన కేంద్రం ఉండాలి. రాష్ట్రాలు కూడా బలంగా ఉండాలి. ఇది మన విధానం. అంతే తప్ప కేంద్రం బలహీనంగా, నామ మాత్రంగా ఉనికి కోల్పేయేలా ఉండడం వల్ల ఎవ్వరికి లాభం. ఇప్పటికే భారత దేశానికి నాలుగు వైపుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు తమ రాజకీయ ప్రయోజనాలు తప్ప జాతి ప్రయోజనాలు పట్టవు. ఆ సమయంలో కేంద్రం బలంగా లేకపోతే ఈ దేశానికి మళ్ళీ విదేశీ ముప్పు దాడుల రూపంలో వస్తే బాధ్యత ఎవరు వహిస్తారు. అధికారాలు ఉండాలి. కానీ అవి ఓ పరిమితికి లోబడి మాత్రమే  ఉండాలి. ఎప్పటికైనా బలమైన దేశం ప్రతి పౌరుడూ కోరుకుంటే బలమైన కేంద్రం తప్పనిసరిగా ఉండాలి.


సంకుచిత రాజకీయం :


నాలుగేళ్ళ పాటు బీజేపీతో కలసి నడచిన టీడీపీ, ఈ మధ్యనే  మరో మారు ఈ దేశానికి మోడీ ప్రధాని కావాలని కోరిన‌ చంద్రబాబు ఇపుడు కేవలం వ్యక్తిగత రాజకీయ అవసారాల కోసం విమర్శలు చేస్తున్నారన్నది అందరి అభిప్రాయంగా ఉంది. ఇపుడు ఆ విమర్శలు గాడి తప్పి ఏకంగా దేశ సమాఖ్య స్పూరితే దెబ్బ తీసే విధంగా వెళ్ళడం బాధాకరమే. ఏపీలోకి సీబీఐని రానివ్వం, కేంద్రం పెత్తనం ఏంటని రోజూ మాట్లాడుతూ రెచ్చగొట్టడం వల్ల తాత్కాలికంగా లబ్ది పొందవచ్చునేమో కానీ దేశానికి తీరని హాని జరుగుతుందన్నది ఎవరూ మరచిపోరాదు. ప్రజలలో వేర్పాటు బీజాలు ఒకసారి నాటుకుంటే అవి ఎంత దూరం వెళ్తాయో మేధావులైన పాలకులు గమనించాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: