మొత్తానికి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలిగా చత్తెస్ ఘడ్ లో ప్రజా తీర్పు పూర్తయింది. అభ్యర్ధుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉన్నాయి. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరిగితేనే ఎవరు విజేతలు అన్నది తేలుతుంది. ఇక రెండు విడతలుగా చత్తీస్ ఘడ్ ఎన్నికలు జరిగాయి. తొలి దశ పోలింగులో 74 శాతం పైగా ఓటింగ్ జరగడం విశేషం. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న 18 అసెంబ్లీ సీట్లకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించారు. 


హరా హోరీగా రెండవ దశ:


ఇక మలి, చివరి దశ పోలింగును నిన్న (మంగళవారం) నిర్వహించారు. మొత్తం 72 అసెంబ్లీ సీట్లకు గాను నిర్వహించిన ఈ ఎన్నికలు హోరా హోరీ పోరును తలపించాయి. ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలో తేలిపోతుంది కాబట్టి అన్ని పార్టీలు సర్వసన్నద్ధమై పోలింగును భారీ ఎత్తున జరిగేలా చూశాయి. రెండవ విడత కూడ 70 శాతానికి పైగా పోలింగు జరిగింది. దాంతో మొత్తం చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో 70 శాతం అధిగమించి ఓటింగు జరిగినట్లుగా చివరి  గణాంకాలు చెబుతున్నాయి. 


నాలువగ సారి :


ఇక్కడ 2003 నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ మొత్తం 15 ఏళ్ళా కాలాన్ని పూర్తి చేసుకుంది. మరో విడత‌ అధికారం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మీద జనంలో మంచి అభిప్రాయం ఉన్నా యాంటి  ఇంకబెన్సీ ఎంత మేర ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీదనే పూర్తినా ఆధారపడి ఉంది. ఆ పార్టీకి రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగిన నాయకత్వం లేకపోవడం లోటుగా ఉంది. ఆ పార్టీ నుంచి వేరు పడిన మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి వేరు కుంపటి పెట్టుకుని పోటీ చేస్తున్నారు. ఆయన చత్తీస్ ఘడ్ జనతా పార్టీ పేరిట పార్టీ పెట్టి బహుజన సమాజ్ వాది పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ గిరిజనం ఓట్లు, సీట్లుపైన రెండు పార్టీలు కన్నేశాయి.


హంగ్ తప్పదా :


చత్తీస్  ఘడ్ లో బీజేపీ పలుకుబడి సహజంగా కొంత తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్ పూర్వం మాదిరిగా పుంజుకోలేదని తెలుస్తోంది. దానికి తోడు అజిత్ జోగీ, బీఎస్పీ మూడవ కూటమి గా రంగంలోకి వస్తున్నాయి. ఈ పరిణామాలను చూసుకున్నపుడు కచ్చితంగా అక్కడ హంగ్ వస్తుందని అంటున్నారు. హంగ్ వస్తే బీజేపీకి మద్దతు ఇవ్వనని అజిత్ జోగీ అపుడే ప్రకటించారు. దాంతో రేపటి రోజున బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కితే పర్వలేదు కానీ, ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే మాత్రం కాంగ్రెస్, అజిత్ జోగీ పార్టీ, బీఎస్పీ కలసి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని పోలింగు సరళి అనుకూలంగా ఉందని  బీజేపీ గట్టిగా చెబుతోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: