సరైన టైం లో ఒక పార్టీ కి వెన్నుముక లాంటి వ్యక్తి పార్టీ వీడితే ఎలా ఉంటుంది పరిస్థితి? అది కూడా వేరే కారణాలతో కాదు కేవలం అసంతృప్తి తో .. ఇప్పుడు తెరాస లో ఇదొక షాకింగ్ పరిణామం గా చెబుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెరాస ని వదిలి వెళ్ళిపోవడం తెరాస కి వెన్నుముక విరిగిపోయినట్టు గా అయ్యింది. అయితే ఇదేదో వేరే పార్టీ కోసమో, పదవుల కోసమో జరిగిన తరుణం కాదు - ప్రజల విషయం లో అధికార పక్షంగా ఉండి కూడా సరిగ్గా పరిస్థితులని డీల్ చెయ్యలేని ఒక ముఖ్యమంత్రి పట్ల సగటు ఎంపీ అసంతృప్తి ఇది. తెరాస లో కి కెసిఆర్ ఆహ్వానం మేరకు విశ్వేశ్వర్ రెడ్డి 2013 లో వచ్చి చేరారు.
Image result for konda vishweshwar reddy
తెలంగాణా సాధించడం లో కెసిఆర్ యొక్క దృక్పదాన్ని నమ్మిన రెడ్డి తెలంగాణా పురోగతి కోసం ఆ పార్టీ లో జాయిన్ అయ్యారు. బంగారు తెలంగాణా సాధనే లక్ష్యంగా కేటీఆర్ సపోర్ట్ తో విశ్వేశ్వర్ రెడ్డి ముందుకి వచ్చారు. తెరాస ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకున్న చేవెళ్ళ సీట్ ని తెరాస ఖాతా లో వేసారు . ఈ గెలుపు ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్న రెడ్డి తన అనుచర గళం తో ఈ సీటు కెసిఆర్ కి బహుమతి గా ఇవ్వాలి అని నిరంతరం కష్టపడ్డారు. ఒకే ఆలోచన తో ఉన్న నాయకత్వం లో వెళుతూ ఉన్నందుకు విశ్వేశ్వర్ రెడ్డి - కెసిఆర్ తో కలిసిన ప్రయాణం విషయం లో చాలా ధీమాగా ఉన్నారు. తన నియోజికవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఎంపీ గా ప్రతీ పనీ చాలా సాఫీగా చేసుకుంటూ వచ్చారు. దాదాపు డేబ్భై గ్రామాలని కవర్ చేస్తూ స్వచ్చ్ భారత్ ని అద్భుతంగా నడిపించారు. 
Image result for kondavishweshwarreddy kcr
పార్లమెంట్ లో తన రాష్ట్రాన్ని, తన ప్రాంతాన్నీ , తన నియోజికవర్గానికి సంబందించిన సమస్యల గురించి తొంభై సార్లు రిప్రజెంట్ చేస్తూ మాట్లాడారు. నియోజికవర్గ అభివృద్ధి గ్రాఫ్ కూడా కొండా రాకతో అద్భుతంగా పెరిగింది అనే మాట వినపడింది. కొండా చెప్పిన కారణాలు ఎవ్వరైనా ఒప్పుకోవాల్సినవే అన్నట్టుగా ఉన్నాయి. పార్లమెంటులో తరచుగా మాట్లాడిన వాళ్లలో విశ్వేశ్వర్ ముందుంటారు. అవును. అలాంటి నాయకుడు ఇప్పుడు లేఖ రాయడం, తప్పుకోవడం అంటే టీఆర్ఎస్ వెన్నెముక విరిగి పోవడమే ! ఎందుకంటే ఒకటి కాదు ఐదు కారణాలు చెప్పారు కొండా.
Image result for kondavishweshwarreddy kcr
పర్సనల్ గా తీవ్రమైన అసంతృప్తి ఉందన్నారు. ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఉద్యమ కారుల్ని పట్టించుకోలేదు అని చెప్పారు. అంతే కాదు, ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య దూరం పెరిగింది అని బైట పెట్టేశారు. జనం ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేక పోతోంది తెరాస పార్టీ అనేశారు. అంతే కాదు జనంతో సంబంధం లేకుండా రాజకీయాలు చేద్దామనుకుంటే అయ్యే పని కాదు చెప్పుకొచ్చారు. కొండా రాజీనామా ముందు చెప్పిన మాటలు కేసీఆర్ కాళ్ల కింద పొలిటికల్ బాంబులు అవుతాయ్. ఎందుకంటే కచ్చితంగా తెలంగాణ ఏం అంటోందో అవే విషయాలు చెప్పారు కొండా కూడా ! పై పెచ్చు తెలంగాణ కోరుకుంటున్నది ఏమిటో రాజీనామాతో తేల్చేసినట్టు అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: