మిజోరాం లో ఎన్నికల వేడి మొదలు అయిపొయింది. నువ్వా నేనా అన్నట్టుగా రాబోయే ఎన్నికలు ఉంటాయి అని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఎప్పటికప్పుడు చైతన్య వంతమైన ఓటర్లు గా మిజోరాం ఓటర్లకి మంచి పేరే ఉంది. ఇలాంటి పరిస్థితి లో ఈ సారి ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు ఉన్న మిజోరాం ప్రాంతం లో ఒక అంశం తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది.
Image result for mizoram
మద్యపాన నిషేధం నిర్ణయం మీద మల్ల గుల్లాలు పడుతున్నాయి అన్ని పార్టీ లూ కూడా. మద్య పాణం ని సంపూర్ణంగా ఆపెయ్యాలి అనేది యువత, మహిళల నుంచి వస్తోన్న అతిపెద్ద డిమాండ్. ఈ క్రమం లో మద్య పానం వీలైతే మొత్తం ఒకేసారి లేదా విడతల వారీగా ఆపేయ్యాలి అనే ప్లాన్ చేస్తున్నాయి చాలా పార్టీలు. అయితే అధికారిక ప్రకటన ఏ రకంగా ఉంటుంది అనేది తెలియడం లేదు.
Image result for mizoram elections
నవంబర్ 28 న ఎన్నికల్లో ఓటు వెయ్యడం కోసం సిద్ధం అవుతున్నారు మిజోరాం వాసులు. దాదాపు నలభై స్థానాల్లో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి ఈ క్రమం లో పదిలక్షల జనాభా తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు.అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష మిజోరాం నేషనల్ పార్టీ. మిజోరాం పూర్తి స్థాయిలో అంటే 1987లో ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్కడ కాంగ్రెస్, మిజోరాం నేషనల్ పార్టీలే పాలించాయి.
Image result for mizoram elections liquor bottles
బీజేపీ ఇక్కడ ఎలాగైనా పాగా వెయ్యాలి అని ప్లాన్ చేస్తోంది. సంపూర్ణ మద్యపానం వైపు మిజోరాం నేషనల్ పార్టీ దృష్టి పెడితే కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తోంది. బీజేపీ మాత్రం బయటి రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై నిషేధం విధించాలని స్థానికంగా రాష్ట్రంలో తయారయ్యే మద్యం పానంను ప్రోత్సహించాలని చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: