ప్రజాస్వామ్యం అంటేనే జవాబుదారీతనం. అది డిమాండ్ చేసి చెప్పించుకునేది కాదు, అలాగని ఏదో మొక్కుబడి తంతుగా చెప్పేదీ  కాదు, తానూ ప్రజలలో ఒకడినని భావించే ప్రతి ప్రజా ప్రతినిధి తనంతట తానుగా నిజం చెప్పాలి. ప్రజలలో తాను సమానుడు అనిపించుకోవాలి. ఇప్పటి రాజకీయాల్లో ఆ నిజాయతీ  ఉందా.


మొక్కుబడి తంతు :


ఏడెనిమిది  ఏళ్ళుగా తాము ఒక్కరమే ఆస్తుల ప్రకటన చేస్తున్నామని తెలుగుదేశం మంత్రి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ గర్వంగా ప్రకటించుకున్నారు. ఆస్తుల ప్రకటన‌ అన్నది కూడా ఓ ప్రచారంగానో మొక్కుబడి తంతుగానే ఉండడమే ఇక్కడ విశేషం. ఇందులో వాస్తవాలు నమ్మేలా ఉంటున్నాయా అన్నది మంత్రి గారే బదులివ్వాలి. ఓ వైపు ఆస్తులు చెబుతూ మరో వైపు అప్పుల చిట్టా  చదవడంలోని మర్మమేంటో కూడా వివరించాలి. ఈ బ్యాలన్స్ షీట్ గొడవ ప్రజలకు ఎందుకు అచ్చంగా మా వద్ద ఇంత ఉంది అని వాస్తవం చెప్పలేరా అంటూ మరో  వైపు సెటైర్లు  వేస్తున్న చైతన్యవంతమైన సోషల్ మీడియాకు జవాబు చెప్పుకోగలగాలి.


వర్తమాన విలువ ఉండదా :


ఈ అస్తుల వ్యవహారంలో మరో ముచ్చట కూడా ఉంది. ఇప్పటి ధరలు, ఈ రోజు విలువ చెప్పరు, ఎపుడో ఆస్తి కొన్న నాటి విలువనే చూపించడం వల్ల ఆస్తులు ఎపుడూ తక్కువగానే కనిపిస్తాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇకపోతే హెరిటేజ్ లాభాలు బాగా గడిస్తోందన్నది ఆస్తుల ప్రకటనలో చెబుతూనే మరో వైపు అప్పులు కూడా సరి సమానంగా పంచడంలో తెలివిడిని కూడా జనం ప్రశ్నిస్తున్నారు. ఈ రకమైన తెలివి లేకనా త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తన అస్తుల ప్రకటన అంటూ ప్రచారం చేసుకోనిదంటున్నారు.


తెల్లకాగితంలా :


నాయకుడు అన్నవాడు తెల్ల కాగితంలా ఉండాలి. అతని జీవితం తెరచిన పుస్తకం అయినపుడు ఏటా ఈ అస్తుల ప్రకటన జాతరలు అవసరమే లేదుగా. ఇక్కడ విపక్షాలకు తరచూ లోకేష్ సవాలు చేస్తూంటారు. మీ ఆస్తులు ప్రకటించరేమని. వారు కూడా ఇలాగే మొక్కుబడి తంతు కధలను వినిపిస్తే జనం ఆ ముచ్చట కూడా చూసే ఓపిక, తీరికా జనాలకు ఉందంటారా అంటూ మరో వైపు పంచులు పడుతున్నాయి. 


జనం తలసరి  పెరగాలి :


ఇవన్నీ ఎందుకు ఏ ఏటికి ఆ ఏడు జనం తలసరి ఎంత పెరిగిందో ఘనమైన ప్రభువులు వివరిస్తే ఇంకా బాగుంటుంది. ఆ పాలనకు మంచి పేరు కూడా వస్తుంది. ఓ వైపు దేశంలో రాష్ట్రంలో పేదల శాతం దారుణంగా పెరిగిపోతూంతే, పించన్లు, నిరుధ్యోగ భ్రుతిలు తీసుకునే వారు, ఐదు రూపాయలకే అన్నం కోసం ఎగబడే వారు ఆంధ్ర దేశం నిండా కనిపిస్తున్నపుడు నాయకులు ఆస్తులు ఎంత పెంచుకుంటేనేంటి, తగ్గించుకుంటేనేంటి. జనం ఓ మెట్టు పైకి ఎక్కించేదే  సిసలైన పాలన కాదా అని మేధావులు అడుగుతున్న ప్రశ్నలకు లోకేష్ వద్ధ జవాబు ఉంటుందా



మరింత సమాచారం తెలుసుకోండి: