జగన్ సభకు వస్తున్న జనాలను చూస్తుంటే పచ్చ పనికి గుండె ఆగిపోవాల్సిందే. ఉత్తరదాంధ్ర మొత్తం జగన్ వైపు ఉందా అన్నట్లు జనాలు బారులు తీసి జగన్ ను చూడటానికి వస్తున్నారు. ఇంటెలిజెన్స్ వారు కూడా ఆశ్చర్య పోతున్నారని చెబుతున్నారు. అయితే  తితిలీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన విషయం విదితమే. తుపాను సమయంలో అధికార పార్టీ, ఏ స్థాయి పబ్లిసిటీ స్టంట్లు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాధితులకు ఆర్థిక సహాయం అందించే విషయంలోనూ, చెక్కులపై చంద్రబాబు ఫొటోలు ముద్రించి.. నవ్వులపాలైపోయింది.

జగన్‌ వెంట ఉప్పెనలా కదిలిన ఉత్తరాంధ్ర

బస్సుల మీద 'తితిలీ తుపానుపై విజయం సాధించిన చంద్రబాబు..' అంటూ ప్రచారం చేసుకుంది చంద్రబాబు సర్కార్‌. వీటిపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వేసిన సెటైర్లను ఎలా మర్చిపోగలం.! తితిలీ తుపాను విలయం నుంచి చంద్రబాబు సర్కార్‌ పుణ్యమా అని శ్రీకాకుళం జిల్లా కోలుకుందా.? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరో చెప్పడం కాదు, బాధితులే చెప్పడానికి సిద్ధంగా వున్నారు.


తమ ఆవేదనని జగన్‌ వద్ద మొరపెట్టుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా శ్రీకాకుళం జిల్లాలోని తితిలీ ఎఫెక్టెడ్‌ ఏరియాస్‌లో టీడీపీ శ్రేణులు పూర్తిగా మోహరించాయి. అన్ని జిల్లాల్లోనూ జగన్‌ పాదయాత్రకు ఆటంకాలు కలిగించినట్లే.. శ్రీకాకుళం జిల్లాలోనూ ఆటంకాలకోసం అధికార పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది. కానీ, జన ప్రవాహాన్ని ఏ జిల్లాలోనూ టీడీపీ అడ్డుకోలేకపోయింది. మొత్తమ్మీద, జన సంద్రాన్ని మించి.. జన ఉప్పెన శ్రీకాకుళం జిల్లాలో కన్పించబోతోందన్నమాట. అవును మరి, ఈ జిల్లాలోనే జగన్‌ పాదయాత్ర ముగియబోతోంది. ఈ నేపథ్యంలో.. జిల్లాలో జన ప్రభంజనం.. జన ఉప్పెన జగన్‌ వెంట కన్పించబోతోందన్నది నిర్వివాదాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: