క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. గురువారం నిర్మాల్ లో జరిగిన బహిరంగ సభలో కెసియార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే హాయిగా ఇంట్లో పడుకుంటానని చెప్పటం దేనికి సంకేతం ? అంటే టిఆర్ఎస్ కు ఓట్లేయాలని కెసియార్ జనాలను బెదిరిస్తున్నట్లో లేకపోతే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లో అనిపిస్తోంది. సెప్టెంబర్ 7వ తేదీన తెలంగాణా ప్రభుత్వాన్ని కెసియార్ రద్దు చేసుకున్నపుడు ఉన్న పరిస్ధితులు ఇపుడు కనబడటం లేదు. అప్పట్లో వరుసగా తన ప్రభుత్వంపై జనాల అభిప్రాయం, టిఆర్ఎస్ ప్రజాప్రతనిధుల పనితీరు తదితరాలపై కెసియార్ వరుసబెట్టి సర్వేలు చేయించుకున్నారు. మరి సర్వేల్లో ఏమి రిపోర్టు వచ్చిందో ఎవరికీ తెలీదు.

 

మొత్తానికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికే కెసియార్ గట్టిగా నిశ్చయించుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సమయానికి కెసియార్ ను పట్టటం అప్పట్లో ఎవరి వల్లా కాలేదు. అంటే కెసియార్ లో అంత జోష్ కనబడింది. సరే, తాను అనుకున్నట్లే ప్రభుత్వానికి రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయారు. ముందస్తు ఎన్నికలకు సిఫారసు చేసిన రోజు సాయంత్రమే కెసియార్ 105 మందికి ఒకేసారి టిక్కెట్లు ప్రకటించారు. దాంతోనే సమస్యలు మొదలయ్యాయి. అభ్యర్ధులను ప్రకటించిన మొదటి వారం రోజులు అభ్యర్ధిత్వాలపై నేతలు, జనాల్లో పర్వాలేదన్నట్లే ఉంది. ఆ తర్వాత సమస్యలు ఒక్కసారిగా నిప్పు రవ్వల్లాగ ఎగరటం మొదలైంది.

 

కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులపై స్ధానిక నేతలు తిరగబడ్డారు. దాదాపు 50 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు తీవ్రస్ధాయిలో ఇఫ్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారంటే పరిస్దితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధమవుతోంది. చాలా చోట్ల పార్టీ నేతలు సహకరించటం లేదు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని చాలా డివిజన్లలో తమకు  కార్పొరేటర్లు పని చేయటం లేదని అభ్యర్ధులే మొత్తుకుంటున్నారు. అభ్యర్ధులపై పార్టీ నేతలు, శ్రేణులు తిరగబడటం కాదు. ప్రచారానికి వెళ్ళినపుడు నియోజకవర్గంలోని జనాలు కూడా నిలదీస్తున్నారు. ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని మొహం మీదే చెప్పేస్తున్నారు.

 

ఇవన్నీ చూసిన తర్వాతేనేమో కెసియార్ లో కూడా ఒక విధమైన నిర్వేధం మొదలైంది. అందుకనే ప్రత్యేకమైన సెంటిమెంటునే మళ్ళీ తట్టి లేపుతున్నారు. తను చేసిన అభివృద్ధిని చూసే జనాలు టిఆర్ఎస్ ను 100 సీట్లలో గెలిపిస్తారని మొదట్లో చెప్పిన కెసియార్ ఇఫుడా ఊసే ఎత్తటం లేదు. పైగా ఈమధ్య కెసియార్ కొడుకు కెటియార్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటుకు టిఆర్ఎస్ కు సొంతంగా మెజారిటీ రాకపోతే సన్యాసం తీసుకుంటానని ప్రకటించటం దేనికి సంకేతం ?

 

119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకైనా  సొంతంగా మెజారిటీ రావాలంటే ఎన్నిసీట్లు కావాలి ?  60 అసెంబ్లీ స్ధానాలు వస్తే చాలు. అంటే కెటియార్ ఉద్దేశ్యంలో టిఆర్ఎస్ కు  60 సీట్లు దాటుతాయని అనుకుంటున్నారా. తండ్రేమో 100 సీట్లకు తగ్గదని ఒకపుడు చెబితే ఇఫుడు కొడుకేమో మెజారిటీ వస్తుందని చెబుతున్నారంటే అర్ధమేంటి ? పైగా గురువారం నిర్మల్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ టిఆర్ఎస్ ఓడిపోయినా తనకొచ్చే నష్టం ఏమీ లేదని చెప్పటమంటే అర్ధమేంటి ?  టిఆర్ఎస్ ఓడిపోతే ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటారట. తాను ముఖ్యమంత్రి కాకపోతే  రాష్ట్రమే నష్టపోతుందని కెసియార్ చెప్పటమే విడ్డూరంగా ఉంది. టిఆర్ఎస్ అభ్యర్ధులు వ్యతిరేకతను ఎదుర్కుంటుండటం, మహకూటమి బలోపేతమవ్వటం లాంటివి చూస్తున్న కేసియార్ గ్రహగతులు, వాస్తు, జాతకాన్ని మాత్రమే నమ్ముకున్నట్లు స్పష్టమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: