ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇబ్రహింపట్నంలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సామా రంగారెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు పెట్టారు. మరో 15 రోజుల్లో పోలింగ్ జరుగుతుందనగా తమ అభ్యర్ధిపై పోలీసులు చీటింగ్ కేసు పెట్టటం ఇటు టిడిపితో పాటు అటు మహాకూటమికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే, మాదాపూర్ లో కోట్ల రూపాయల విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు భూ యజమాని సంతకాన్ని రంగారెడ్డి పోర్జరీ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

భూ యజమాని నుండి తమకందిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు పోర్జరీ వ్యవహారం నిజమే అని తేల్చుకున్న తర్వాతే రంగారెడ్డిపై 420, 468, 471 ఐపిసి సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. టిడిపి నేత పోర్జరీకి సంబంధించి నాంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అసలే ఇబ్రహింపట్నంలో  పోటీచేసే విషయంలో సామా రంగారెడ్డి కిందా మీదా అవుతున్నారు. ఆయన మనస్సంతా ఎల్బీ నగర్ నియోజకవర్గంపైనే ఉంది. అయితే పొత్తుల్లో భాగంగా ఆ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి టిడిపి వదులుకోవాల్సొచ్చింది.

 

అదే సమయంలో ఇబ్రహింపట్నంపై చాలామంది కాంగ్రెస్ నేతల కన్నుంది. కానీ పొత్తుల పేరుతో టిడిపికి ఆ సీటను కాంగ్రెస్ వదిలేసుకుంది. దాంతో అయిష్టంగానే సామారంగారెడ్డి ఇబ్రహింపట్నంలో అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. కానీ నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తానకు ఇక్కడ పోటీ చేయటం ఇష్టం లేదని కాబట్టి ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. దాంతో చేసేది లేక బిఎస్పీ తరపున నామినేషన్ వేసిన కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ మల్ రెడ్డి రంగారెడ్డికే కాంగ్రెస్, మహాకూటమి మద్దతు ప్రకటించాయి. కానీ తాజాగా తాను పోటీలోనే ఉంటానని సామా మళ్ళీ చెబుతున్నారు. దాంతో నియోజకవర్గంలో పెద్ద గందరగోళం మొదలైది. ఇటువంటి నేపధ్యంలోనే సామారంగారెడ్డిపై పోర్జరీ కేసు నమోదవ్వటంతో మహాకూటమిలో పెద్ద కలకలమే రేగుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: