పవన్ కళ్యాణ్ కు ఉన్నట్టుండి జగన్ మీద కు గాలి సోకినట్టుంది . అందుకే ఇప్పుడు జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేసి రాజకీయ లభ్ది పొందాలనుకుంటున్నాడు. అయితే ఆ వ్యాఖ్యలు తన స్థాయిని దిగ చార్చే విధంగా ఉన్నాయి. జగన్ మీద దాడి గురించి టీడీపీ మాట్లాడినట్లే ఇంచు మించు అలాగే మాట్లాడుతున్నాడు. తాజాగా, త‌న కాన్వాయ్ కు...అదే విధంగా పార్టీ నేత మ‌నోహ‌ర్ కారుకు ప్ర‌మాదం జ‌రిగిన తీరు ను ప‌వ‌న్ వివ‌రించారు. తాను జ‌గ‌న్ లాగా కోడి క‌త్తి గుచ్చుకోగానే హ‌డావుడి చేయ‌లేదంటూనే...లోకేష్ మీరు పార్టీ న‌డిపే వ్య‌క్తి..ఇలాంటి కుతంత్రాల‌కు పాల్ప‌డితే ఎలా అని ప్ర‌శ్నించారు. త‌న‌కు ఏదైనా జ‌రిగితే డిజిపి దే బాధ్య‌త అని ప‌వ‌న్ హెచ్చ‌రిస్తున్నారు. 

జ‌గ‌న్ పై పెరిగిన స్వ‌రం...

ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న ప‌ర్య‌ట‌న లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..మంత్రి లోకేష్ ను నిరంర‌తం టార్గెట్ చేస్తున్నారు. రాజ‌కీ యం గా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబు కు వ‌య‌సు అయిపోయింద‌ని..ఆయ‌న ఇక పాల‌న‌కు ప‌నికిరార‌ని ప‌వ‌న్ విమ‌ర్శిస్తున్నారు. ఇక‌, తాజాగా త‌న కాన్వాయ్ కు జ‌రిగిన ప్ర‌మాదం పైనా వ‌ప‌న్ స్పందించారు. త‌న కాన్వాయ్ కు ప్ర‌మాదం జ‌రిగితే తాను జ‌గ‌న్ లా కోడిక‌త్తి గుచ్చారు..గుచ్చారు అని రాజ‌కీయం చేయ‌లేద‌న్నారు.

ఏం జ‌రిగినా డిజిపిదే బాధ్య‌త‌...సీయం అవుతా..

చంద్ర‌బాబు..జ‌గ‌న్ కు తెలంగాణ లో తిరిగలేర‌ని ఎద్దేవా చేసారు. ఇక‌, ఒకే రోజు త‌న వారికి రెండు ప్ర‌మాదాలు జ‌రిగాయాని..కాన్వాయ్ కు ప్రమాదం....అదే రోజు పార్టీ నేత మ‌నోహ‌ర్ కారును ఇసుక లారీ గుద్దేసింది..అది ఉద్దేశ‌పూర్వ‌క‌మో..యాధృచ్చిక‌మె అంటూనే.. తాను వీటి పై రాజ‌కీయం చేయ‌న‌ని చెబ‌తూనే బాబు లోకేష్‌..పార్టీ న‌డపాల్సిన వ్య‌క్తివి..కుతంత్రాల‌కు పాల్ప‌డితే ఎలా ప్ర‌శ్నించ‌టం కొస మెరుపు...పరోక్షంగా లోకేష్ ను ఈ విష‌యంలో ప‌వ‌న్ టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌తంలో కాంగ్రెస్ ను తిట్టిన టిడిపి ఇప్పుడు వారిని మోస్తుంద‌ని..త్వ‌ర‌లో వారు జ‌గ‌న్‌తోనూ పొత్తు పెట్టుకుంటార‌న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: