త్యాగాలు చేశాం, తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చామని యూపీయే చైర్ పర్సన్ సోనియాగాంధీ అంటున్నారు. త్యాగం ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్న దాన్ని పాలకులు ఇస్తే అది త్యాగం అంటారా. పోనీ అడిగిన వెంటనే తెలంగాణా ఇచ్చేశారా. దశాబ్దాలా పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణాను త్యాగం చేసి ఇచ్చామనడం ద్వారా అమరవీరుల ఉద్యమాలను అవమానించడమే అవుతుంది. 


రాజకీయ క్రీడ :


నిజానికి తెలగాణా రాష్ట్రం కోరుకునంది ప్రజలు. కానీ అది వచ్చినది మాత్రం త్యాగాలతో కాదు, రాజకీయ క్రీడ ద్వారానే. అందరూ అందులో రాజకీయమే చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 2004 సమయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలను గుప్పించింది. అందులో భాగమే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని. కానీ తెలంగాణా ఇచ్చినది 2014లో అంటే పదేళ్ళ పాటు పోరాటమే జరిగింది అందుకోసం. ఈ మధ్య  ఆ నినాదాన్ని అడ్డం పెట్టుకుని రెండు మార్లు కాంగ్రెస్  కేంద్రంలో  అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా మూడవ మారు కూడా దాన్నే ట్రంపు కార్డ్ గా వాడుకుందామని చూసింది. అయితే విసిగిపోయిన తెలంగాణా జనం రాష్ట్రం కోసం పోరాడిన టీయారెస్ కి పట్టం కట్టారు. ఇది కదా చరిత్ర.


అధికారం కోసమే:


తెలంగాణాలో టీయారెస్ ని అడ్డం పెట్టుకుని అధికారం సంపాదించాలని కాంగ్రెస్ చూసింది నిజం. ఐతే కధ అక్కడ అడ్డం తిరిగింది. దాంతో రాజకీయ ఆరాటం అలా ఆగిపోయింది. ఇపుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. అందుకోసం త్యాగాలు, ప్రేమలు, తల్లీ బిడ్డ అంటూ సోనియాగాంధీ కొత్త మాటలతో జనాల్లోకి వచ్చారు. తెలంగాణా అంటే తన తల్లికి ఎంతో అభిమామనమి, ఆమె తెలంగాణా పక్షపాతి అని రాహులు గాంధి అంటున్నారు. మరి ఇంతటి అభిమానం ఉన్న సోనియాఘాంధి ఇన్నాళ్ళు ఈ వైపుగా ఎందుకు రాలేదు, ఎన్నికల వేళ మాత్రమే వస్తారా. అంటే ఓట్ల రాజకీయమే తప్ప మరేం పట్టవా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.


పాలన చూసే ఓటు:


నిజానికి కాంగ్రెస్ పాలన తెలంగాణాకు కొత్త కాదు, వైఎస్సార్ ఉన్నపుడు ఒక్కరే సీఎం కానీ ఆయన చనిపోయాక ముగ్గురు మారారు. ఇపుడు కాంగ్రెస్ కూటమి కట్టింది. ఎందరో సీఎం క్యాండిడేట్లు ఉన్నారు. మరి వారి అందరినీ ఒక గాటన చేర్చి అయిదేళ్ళు ఇతనే ముఖ్యమంత్రి అని సోనియాగాంధి ఎందుకు చెప్పలేకపోయారు. పైగా అలవి కానీ హామీలను గుప్పించడం ద్వారా జనాన్ని వంచించేందుకు  రెడీ అయ్యారన్న విపక్షాల విమర్శలకు జవాబేదీ.


మరింత సమాచారం తెలుసుకోండి: