పవన్ కళ్యాణ్ జగన్ మీద చేస్తున్న విమర్శలు తిరిగి చివరికి పవన్ కే తగులుతున్నాయని చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ను ఢీ కొట్టి నిలబడి పార్టీ ని జగన్ నడుపుతున్నాడని అందరికీ తెలుసు. అలాంటిది గట్టిగా పది రోజులు కూడా ప్రజల్లో యాత్ర చేయలేని పవన్ జగన్ ను విమర్శిస్తుంటే అందరికీ నవ్వొస్తుంది.  లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ పై విరుచుకుపడ్డారు. పొడిచినంత మాత్రాన గగ్గోలు పెట్టనని, రెండుసార్లు అటెంప్ట్ జరిగినా తాను ధైర్యంగా నిలబడ్డాను అన్నారు. అంతేకాదు, జగన్ పోరాడలేడని, జగన్ కు తన ఎమ్మెల్యేలను కాపాడుకునే దమ్ములేదని అన్నారు.


జగన్ మీద వ్యాఖ్యలతో తన స్థాయిని తానే దిగదార్చుకున్న పవన్ ..!

ఈ మాటలు వింటే నవ్వొస్తోంది. పొడిచిన తరువాత జగన్ ఏమాత్రం సంయమనం కోల్పోలేదు. రోడ్డుకు ఎక్కి రచ్చ చేయలేదు. సమగ్ర దర్యాప్తు కోసం పోరాడుతున్నారు తప్ప, అల్లర్లు చేయలేదు. ఇక పోరాట గురించి మాట్లాడితే, జగన్ కాంగ్రెస్ ను ఢీకొన్నాడు. తనకు సమస్యలు వస్తాయని తెలిసీ, ఢీకొట్టి, జైలుకు వెళ్లి, ఇప్పటికీ అదేపోరు కొనసాగిస్తున్నాడు. ఎన్నిదాడులు జరిగినా, సీజ్ లు జరిగినా, సమస్యలు వచ్చినా, పోరు ఆపలేదు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం గురించి పవన్ నే మాట్లాడాలి.

పవన్ కు కోచింగ్ ఎవరిస్తున్నారో?

నాలుగేళ్లలో ఇరవైమంది వెళ్లిపోయారు. ఎలా వెళ్లిపోయారో? ఎందుకు వెళ్లిపోయారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. మిగిలినవారు మాత్రం జగన్ తోనే వున్నారు కదా. వెళ్లిపోతున్నారని భయపడి, జగన్ పార్టీని తీసుకెళ్లి మరే పార్టీలోనూ కలిపేయలేదు కదా? ఓ మంత్రిపదవి కోసం పార్టీని గంపగుత్తగా ఇచ్చేయలేదు కదా? మరి ఏ విధంగా జగన్ దమ్ములేని లీడర్ గా కనిపిస్తున్నాడు పవన్ కు. ఒక్కసారి తన అన్న రాజకీయ చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఎవరికి దమ్ములేదో? ఎంపీ పదవి అయిపోగానే రాజకీయాలు వదిలేసాడు కదా? అంతెందుకు, గ్యాప్ లేకుండా ఓ పద్దతిగా సాగుతోందా? పవన్ యాత్ర. గత కొంతకాలంగా ఈస్ట్ గోదావరిని పట్టుకు వదలడం లేదు. మిగిలిన జిల్లాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇతగాడు ఏడాదికి పైగా పాదయాత్రలోనే వున్న జగన్ ను విమర్శించడం.

మరింత సమాచారం తెలుసుకోండి: