టీడీపీ నేతల మీద జరుగుతున్న ఐటీ దాడులు ఇప్పడూ ఆ పార్టీ లో కల కలం రేపుతోంది. ఆపార్టీ నాయకుల అవినీతి చిట్టా ను బయిటకి లాగే పనిలో ఈడీ ఉందిప్పుడు.  హైదరాబాద్ లోని పంజాగుట్టలోని సుజనా చౌదరికి సంబంధించిన ఒక కార్యాలయంలో ఏకంగా నూటా ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు దొరికాయనే మాట అత్యంత ఆసక్తిదాయకంగా మారింది. ఒకేచోట నూటా ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించిన స్టాంపులు అంటే.. ఈ కంపెనీల డొల్ల ఏమిటో తేలిపోతోంది. షెల్ కంపెనీలు సృష్టించడం.. వాటికి  బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం.. ఆ తర్వాత ఆ డబ్బును వివిధ కంపెనీలకు తరలించడం.. ఆ డొల్ల కంపెనీలు చేసిన వ్యాపారాల్లో నష్టపోయాయని చేతులు ఎత్తేయడం! ఇదీ బ్యాంకులకు సుజనా గ్రూప్ నెత్తిన చేయిపెట్టిన వైనం అని తెలుస్తోంది.


షాక్ : టీడీపీ నేత సుజనా చౌదరి అరెస్ట్ కు రంగం సిద్ధం ... మరీ బాబు ఏం చేస్తాడు...!

రాజకీయ నేతలపై రకరకాల స్కాముల ఆరోపణలు రావడం మామూలే. అయితే చౌదరి నిండా ముంచింది ప్రభుత్వరంగ బ్యాంకులను! అంటే.. ప్రజల సొమ్ములను దాచుకునే బ్యాంకులను చౌదరి మోసం చేశాడని ఈడీ అంటోంది. అది కూడా ఐదువేల ఏడువందల కోట్లరూపాయల స్థాయిలో అంటే.. చాలా ప్రభుత్వరంగ బ్యాంకులకు కూడా ఇది భారీదెబ్బ. ఈ సొమ్ము ప్రజలది. ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో దాచుకుంటే.. ఇలాంటి వైట్ కాలర్ మోసగాళ్లు అప్పుల రూపంలో ఆ డబ్బును తీసుకుని బ్యాంకుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. ఆ ప్రభావం బ్యాంకుల మీద.. అంతిమంగా ప్రజల మీద పడుతోంది.


షాక్ : టీడీపీ నేత సుజనా చౌదరి అరెస్ట్ కు రంగం సిద్ధం ... మరీ బాబు ఏం చేస్తాడు...!

డొల్ల కంపెనీలకు బ్యాంకు లోన్లను ఇప్పించడంలో సుజనా చౌదరి డైరెక్టుగా గ్యారెంటీ పడ్డాడని తెలుస్తోంది. దీంతో ఈ స్కామ్ లో ఈయన ప్రమేయం స్పష్టం అవుతోంది. ఇక చౌదరి సంబంధిత స్థలాలపై ఈడీ దాడులు చేసి.. పలు ఖరీదైన కార్లను కూడా సీజ్ చేయడం విశేషం. పోర్షే, ఫెరారీ.. వంటి అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను ఈడీ అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: