ఏపీలో ఎన్నికలు ఎపుడు. ఈ ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు లోక్ సభకు, అసెంబ్లీలకు వస్తాయన్నప్పటి నుంచి ఈ అంశం నలుగుతూనే ఉంది. అయితే అనూహ్యంగా తెలంగాణా ఎన్నికలు ముందుకు వచ్చాయి. కేంద్రంలోకి మోడీ సర్కార్ వెనక్కు వెళ్ళిపోయింది. ఈ డిసెంబర్ తో అయిదు రాష్ట్రాల ఎన్నికల సమరం పూర్తవుతుంది. దాంతో మళ్ళీ ఏపీ వైపు అందరి చూపు పడుతోంది.


ఫలితాలను బట్టి :


అయిదు రాష్ట్రాల ఎన్నికలను చూసుకుంటే కాంగ్రెస్, బీజేపీల మధ్య సెమీ ఫైనల్స్ గా భావించాలి. ఎవరు ఎక్కువ గెలిస్తే వారిదే రేపటి రోజున పైచేయి అవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా, ఓడినా ఫిబ్రవరిలో ముందస్తుకు వెళ్ళాలని మోడీ, షా ద్వయం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒక వేళా ఓడిపోతే ఆ వ్యతిరేకత మరింత పెరగకుండా పార్లమెంట్ ఎన్నికలు జరుపుతారని, గెలిస్తే ఆ ఊపు కంటిన్యూ చేయడం కోసం ఎన్నికలు తీసుకువస్తారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఎన్నికలు కొంత ముందుకు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.


సంక్రాంతి  తరువాత :


దీనిపై ఏపీలో విపక్ష వైసీపీకి కూడా కొంత క్లారిటీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ దీనిపై మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తరువాత  ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే  అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి నెలాఖరులో లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కోనడం విశేషం. 


ఆ విధంగా చూసుకున్నపుడు ఏపీలో బాబు సర్కార్ కి మిగిలింది అతి తక్కువ సమయమేనని అర్ధమవుతోంది. మోడీ, షా మంత్రాంగం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే, దానిని బట్టి ఏపీ జాతకం నిర్ణయం అవుతుందని అంటున్నారు. ఓ విధంగా బాబుకు షాక్ ఇచ్చేందుకే మోడీ షా వ్యూహం రచిస్తారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: