తెలంగాణా ఎన్నికలు బాగా వేడెక్కెతున్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో సంచలన ఘటన నమోదైంది. మహాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డి ఆత్మహత్యాకు ప్రయత్నించారు.  తన ఇంట్లో పోలీసుల సోదాలను నిరసిస్తూ వంటేరు ఒంటిపై పెట్రోలు పోసుకుని కాల్చుకునేందుకు ప్రయత్నించటం సంచలనంగా మరాంది. పోలీసు ఓవర్ యాక్షన్ ఫలితంగా కాంగ్రెస్ నేతల్లో కానీ వంటేరు మీద ఒత్తిడి పెరిగిపోతోంది.


గజ్వేలు నియోజకవర్గంలో కెసియార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న వంటేరు వల్ల కెసియార్ కు ఇబ్బంది మొదలైంది. సహజంగానే వంటేరు గట్టి అభ్యర్ధి క్రిందే లెక్క. అటువంటిది టిడిపిలో నుండి కాంగ్రెస్ లోకి మారటం, మహాకూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తుండటంతో మరింత బలోపేతమయ్యారు. దాంతో కెసియార్ కు ఇబ్బందులు మొదలయ్యాయి.

 

ఎన్నికల్లో గెలుపోటములను పక్కనపెట్టినా వంటేరు మాత్రం గట్టి పోటీనే ఇస్తున్నారు. దానికితోడు టిఆర్ఎస్ లోని పలువురు నేతలు రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరటంతో కాంగ్రెస్, మహాకూటమిలో జోష్ పెంచింది. దాంతో ప్రచారంలో వంటేరు రెచ్చిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే వంటేరు లక్ష్యంగా పోలీసుల ఓవర్ యాక్షన్ మొదలైంది. ప్రచారంలో స్వేచ్చగా తిరిగేందుకు లేకుండా వంటేరుకు పోలీసుల ఆంక్షలు అడ్డుపడుతున్నాయి. అది కాకుండా నేతలను కలవటానికి, జనాలను కలవటంలో కూడా వంటేరుపై పోలీసులు నిఘాపెట్టారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్ధిలో సఫొకేషన్ మొదలైంది.

 

ఆ విషయం మీదే వంటేరుకు పోలీసులతో రెండు రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. మొన్న కూడా వంటేరు స్వేచ్చగా తిరగనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దానికి తోడు సోమవారం రాత్రి వంటేరు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. జనాలకు డబ్బులు పంచుతున్నారని, ఆ నిధులంతా వంటేరు ఇంట్లోనే ఉన్నాయంటూ పోలీసులు ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. దాంతో ఒకవైపు పోలీసు బలగాలు మరోవైపు కాంగ్రెస్, మహాకూటమి నేతలు, శ్రేణులు భారీగా మోహరించటంతో టెన్షన్ మొదలైంది.

 

కెసియార్ వ్యూహమేమిటంటే వంటేరును ప్రచారం చేసుకోనీయకూడదని స్పష్టంగా అర్ధమైపోతోంది. దాంతో పోలీసుల చర్యను నిరసిస్తూ వంటేరు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించటంతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే తేరుకుని వంటేరును అదుపులోకి తీసుకున్నారు లేండి. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారన్న ఆరోపణపై వంటేరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు ఈ ఘటన ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: