అందరిలోను ఇపుడు అదే అనుమానం మొదలైంది. ఐపిఎస్ అధికారిగా ఉన్నపుడే అంతంత మాత్రం. అవును ఆయనే సిబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి విరమణ  చేసిన లక్ష్మీనారాయణ. ఏదో జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు మీడియా కారణంగా అప్పట్లో చాలా కాలం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. చంద్రబాబు మీడియా లక్ష్మీనారాయణను ఓ హీరోగా చిత్రీకరించింది. అవినీతి మీద పోరాటం చేస్తున్న ఏకైక పోలీసు అధికారిగా ఆయనకు పెత్త బిల్డప్ ఇచ్చింది. దాంతో జగన్ వ్యతరేకులకు, మధ్య తరగతి జనాలకు లక్ష్మీనారాయణ ఓ హీరో అయిపోయారు అప్పట్లో. తరువత జరిగిన పరిణామాల్లో ఆయన చంద్రబాబునాయుడు జేబులోని మనిషిగా తేలిపోయింది. ఆ విషయాన్ని మాత్రం చంద్రబాబు మీడియా ఎక్కడా కవర్ చేయలేదనుకోండి అది వేరే సంగతి.

 

సీన్ కట్ చేస్తే ఉద్యోగ విరమణ చేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చారు. కొత్త పార్టీ పెడతానని చెప్పారు. ఏదో ఓ పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆయనే అంటూ ఊదరగొట్టారు. ఆమ్ ఆద్మి పార్టీ, లోక్ సత్తా తదితర పార్టీలతో చర్చలు కూడా పూర్తయిపోయాయి. పార్టీ పెడతానని చెప్పిన లక్ష్మీనారాయణ 24 గంటలు తిరక్కముందే ప్లేటు పిరాయించేశారు. అంటే దిగితే కానీ లోతు తెలీదన్న సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. రాజకీయాలను బయటనుండి చూడటం వేరే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనటం వేరన్న విషయం  ఆయన త్వరగానే గ్రహించారు.

 

నిజానికి లక్ష్మీనారాయణ ఏదో ఓ పార్టీలో చేరితే సరిపోయేదేమో. అలాకాదని తానే కొత్త పార్టీ పెడతానని చెప్పటంతోనే తేడా కొట్టేసింది. కొత్త రాజకీయ పార్టీ పెట్టి నడపటం జగన్ మీద కేసులు పెట్టి విచారించటం అంత తేలికనుకున్నారేమో ? మెగాస్టార్ చిరంజీవి, జయప్రకాష్ నారాయణ వల్లే పార్టీలు పెట్టి నడపటం చేతకాలేదు. లక్ష్మీనారాయణ స్ధాయి ఏదో ఒక పార్టీలో చేరి పెద్ద పోస్టు తీసుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. అదికూడా కొంత క్రేజ్ ఉంది కాబట్టి. మొత్తానికి లక్ష్మీనారాయణకు తత్వం తొందరగానే బోధపడింది. కాబట్టి భవిష్యత్తేమిటో ఆయనే తేల్చుకోవాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: