పవన్ కళ్యాణ్ రాజకీయ భాష బాగానే నేర్చేసుకుంటున్నారు. సానుభూతి డైలాగులతో బురిడీ కొట్టించేస్తున్నారు. పవన్ ఏం చెప్పినా నిజాయతీ ఉంటుందని అంతా భావిస్తారు. అయితే ఆయన తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ లోని డొల్లతనం బయటపడిపోతోంది. దాంతో పవనూ అచ్చమైన పొలిటీషియనేనా అని అంతా అనుకుంటున్నారు.


వందకోట్ల సంపాదన :


పవన్ కళ్యాణ్ ఈ మధ్య జనంలోకి వస్తూ తాను ఏడాదికి వంద కోట్ల సంపాదన వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్నారు. తరచూ అదే చెబుతూ తానొక త్యాగపురుషుడిగా పవన్ అభివర్ణించుకుంటున్నారు. మరి పవన్ ఇలా చెప్పుకోవడం ద్వారా సానుభూతిని పొందాలన్నదే ప్రయత్నమట. నిజానికి అప్పట్లో అన్న గారు రాజకీయాల్లోకి వచ్చినపుడు  ఎక్కడా ఇలా తాను సినిమాల్లో లక్షలు (అప్పట్లో అదే పెద్ద రెమ్యున‌రేషన్) పోగొట్టుకుని వచ్చానని చెప్పుకోలేదు  తాను సేవ చేసేందుకు స్వచ్చందంగా వచ్చాననే చెప్పేవారు. మరి పవన్ తీరు ఎలా ఉందంటే తాను త్యాగం చేశాను కాబట్టి తననే గెలిపించి సీఎం చేయాలని అన్నట్లుగా ఉందని ఓ వైపు సెటైర్లు పడుతున్నాయి. మరో వైపు పవన్ వంద కోట్ల సంపాదన కూడా వివాదాస్పదమవుతోంది.


కౌంటరేసిన   కత్తి :


అన్నేసి వందల కోట్లు ఏడాదిలో ఎలా వస్తాయో పవన్ చెప్పాలంటూ సినీ విమర్శకుడు కత్తి మహేష్ కౌంటరేసాడు. పవన్ ఏడాదికి చేసేది ఒకే ఒక సినిమా అని. దానికి గాను ఆయన పారితోషికం పాతిక కోట్లు ఉంటుందని, అదే అఫీషియల్ గా  అయితే 12 కోట్లని కత్తి మహేష్ ఒక లెక్క బయటకు తీశారు. పవన్ పారితోషికం పాతిక  కోట్లు అనుకుంటే ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేస్తేనే తప్ప వంద కోట్లు జమ కావని, అలాంటపుడు పవన్ తాను వంద కోట్లు సొమ్ము వదులుకున్నానని ఎలా క్లైం చేసుకుంటారని లాజిక్ పాయింట్ ఒకటి బయటకు లాగాడు


అంతటితో ఊరుకోలేదు. రాజకీయాల్లోకి వస్తునట్లుగా 2014లో పవన్ ప్రకటించి తరువాత టీడీపీకి మద్దతు ఇచ్చారని, ఆ విధంగా ఆయన రాజకీయాల్లో ఎక్కువ ఆశించి వచ్చారేమోనని కూడా సెటైర్లు వేశారు కత్తి మహేష్ . మొత్తానికి పవన్ ఎదో  జనాల్లో సింపతీ కోసం వంద కోట్లు అంటే అది కూడా ఇపుడు వివాదమై కూర్చుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: