తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రకటించిన నాటి నుండి టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీతో రహస్య బంధం కొనసాగిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పక్ష పార్టీలు మరియు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక కామెంట్ చేశారు.

Image result for modi

ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు రానున్న రోజుల్లో తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే గాని సాధ్యం కాదని ఎంతోమంది పెద్ద పెద్ద తలకాయలు మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలో రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ ఆవిష్కారం కాబోతుందని ప్రచారం చేస్తున్నారు.

Image result for modi ktr

ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం లో భాగంగా కేటీఆర్ మొట్టమొదటిసారి బిజెపి నాయకులకు మరియు మోడీపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. నరేంద్ర మోడీ విదేశాలు తిరగటం తగ్గించి దేశంలో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయి. హెలికాఫ్టర్లో తిరగటం కాదు, నేల పై దిగి ప్రజలతో మాట్లాడితే అభివృద్ధి ఏమిటో తెలుస్తుంది” అన్నారు.

Image result for modi ktr

డిసెంబర్ 7 తర్వాత తెలంగాణాలో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు పరాభవం తప్పదని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి మోడీ హయాంలో ఒరిగిందేమీ లేదని కేవలం రాష్ట్ర ప్రభుత్వం వల్లే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని పేర్కొన్నారు కేటీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: