వర్తమాన రాజకీయాల్లో సిధ్ధాంతలు, విలువలు ఏమీ లేవని సుదీర్ఘ అనుభవశాలి చంద్రబాబునాయుడు కుండబద్దలు కొట్టారు. అవసరాల మేరకు కలవవడమే ప్రస్తుత రాజకీయమని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ఇపుడు అంతా మోడీకి వ్యతిరేకంగా కలుస్తున్నారని, ఇదంతా దేశ ప్రయోజనం కోసమేనని చెప్పుకొచ్చారు. మొత్తానికి బాబు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు.


సమీకరణల యుగం:


ఇది సమీకరణల యుగమని చంద్రబాబు కొత్త సూత్రీకరణ చేశారు. సిధ్ధాంతాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని కూడా ఆయన అంటున్నారు. మోదే దేశంలో నియంతలా వ్యవహరిస్తున్నారని, అన్ని వ్యవస్థలను దెబ్బ తీస్తున్నారని బాబు పేర్కొన్నారు. అందువల్ల ఆయన్ని ఎదుర్కోవడం కోసం అంతా ఒక్కటి కావడంలో తప్పు లేదని, ఇందులో స్వార్ధం కంటే పరమార్ధమే ఎక్కువని కూడా బాబు చెప్పుకొచ్చారు.


రాహుల్ కూటమి ఖాయం :


దేశంలో వచ్చేది రాహుల్ కూటమని, పోయేది నరేంద్ర మోడీ ప్రభుత్వమని బాబు పక్కా క్లారిటీతో చెప్పారు. దేశంలో అంతా ఎకపక్ష  ధోరణితో సాగుతున్న వేళ విపక్షాలు సిధ్ధాంతాలను పక్కన పెట్టి కలసి రావాల్సిన అవసరం ఏర్పడిందని బాబు చెప్పారు. అందుకోసమే తాను కాంగ్రెస్ తో చేతులు కలిపానని ఆయన సమర్ధించుకుంటున్నారు దేశ ప్రయోజనాలే ముందు, రాజకీయాలు తరువాత అన్నట్లుగా బాబు మాట్లాడుతున్నారు.


 మొత్తానికి చంద్రబాబు కాంగ్రెస్ తొ పొత్తును సమర్ధించుకోవడానికి కొత్త సిధ్ధాంతాన్నే  ప్రతిపాదిస్తున్నారు. ఎవరు ఎవరితోనైనా కలసిపోవచ్చు, విలువలు, నీతులు అన్న మాటలిక చెల్లవు, కానీ దానికి ఓ అందమైన పేరు పెట్టుకోవాలి. అదే దేశ క్షేమం, ప్రజాస్వామ్యం పరిరక్షణ వంటి ముసుగు తొడిగించుకుంటే చాలు. ఈ నవీన సిధ్ధాంత కర్త బాబుకు రేపు  రెండు రాష్ట్రాల ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో ఇక చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: