రాజకీయం అన్న తరువాత వ్యూహాలు, నినాదాలు ఉండాలి. అవి జనంలోకి పోవాలి. వాటిని జనం రిసీవ్ చేసుకునేలా ఉండాలి. అపుడే అవి సక్సెస్ అవుతాయి. మనకు బాగుందని భావిస్తే జనం మెచ్చరు. మనకు బాగున్న దానిని జనం నచ్చేలా చెప్పి మెప్పించడంలోనే రాజకీయ విజయం దాగుంది.


ఆ మూడు పార్టీలే :


ఇపుడిపుడే  జగన్ రాజకీయంగా రాటుదేలుతున్నారు. ప్రత్యర్ధి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రెడీ చేస్తున్నారు. ఏపీలో మూడు పార్టీలు ఒక్కటి అని, కలసిపోయారని ఓ వైపు చంద్రబాబు భయంకరమైన ప్రచారం మొదలుపెట్టారు. మోదీ, జగన్, పవన్ ఒక్కటి అని, వారికి ఏపీ ప్రజలు ఓట్లు వేయరాదని బాబు ప్రతి సభలోనూ పిలుపు ఇస్తున్నారు. అందుకోసం ఆయన అనేక మీటింగులు, మీడియా మీట్స్ కూడా పెడుతూ గత కొన్ని నెలలుగా ఎండగడుతున్నారు.
మరి దాని తీవ్త్ర తెలిసి వచ్చిందో, లేక వ్యూహం మార్చారో తెలియదు కానీ జగన్ ఇపుడు కొత్త నినాదం అందుకున్నారు. ఆయనదీ ఆ మూడు పార్టీల నినాదమే. టీడీపీ, బీజేపీ, జనసేనలను నమ్మవద్దు ఓటు వేయవద్దు అంటూ  జగన్ జనంలోకి పోతున్నారు.


మోసం  చేశాయని :


ఈ మూడు పార్టీలు 2014 ఎన్నికల్లో ఒక్కటిగా  జనం ముందుకు వచ్చి అనేక హామీలు ఇచ్చాయని, అధికారంలోకి వచ్చాక హామీలను మరచిపోయాయని జగన్ ఆరోపిస్తున్నారు. ఇందులో లాజిక్ ఉంది. బాబు, మోడీ, పవన్ కలసి ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చింది వాస్తవం. పవన్ అయితే మద్దతు మాత్రమే ఇచ్చారు, అధికారం పచుకోలేదు కానీ ఆయన కూడా కూటమిలో ఉన్నట్లే లెక్క. ఇపుడు ముగ్గురూ వేరుగా ఉన్నారు. దీన్నే జగన్ ఎత్తి చూపుతున్నారు. బాబు చెప్పినట్లుగా జగన్, పవన్, మోడీ కలయిక అన్నది ఊహాజనితమైన ఆరోపణ. కానీ జగన్ చెబుతున్నది జరిగిన వాస్తవం. 


సరిగ్గా దీన్ని జనంలోకి వైసీపీ తీసుకుపోగలిగితే ఆ మూడు పార్టీలకు నష్టమే కలుగుతుంది. పవన్ ఇపుడు జనసేన పేరిట వేరు కుంపటి పెట్టుకున్నా ఆయన బాబుని గెలిపించమని గతంలో కోరారు, మీటింగులూ పెట్టారు. . అందువల్ల  బాబు సర్కార్ తప్ప్ల విషయంలో బీజేపీ, పవన్ కూడా న్యాయంగా అయితే బాధ్యత వహించాల్సిందే. మరి ఈ వ్యూహంతో జగన్ ఈ ముగ్గురిని కట్టడి చేయాలనుకుంటున్నారు. అది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: