టీడీపీ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఈడీ వలలో కరెక్టుగా దొరికాడు ఇప్పుడేమో చెయ్యాలో తెలియక తికమక పడుతున్నాడు . ఈడీ సమన్లను రద్దు చేయమంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన టీడీపీ ఎంపీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరికి ఝలక్ తగిలింది. చౌదరి పిటిషన్ ను విచారించిన కోర్టు ఈడీ సమన్లను రద్దు చేయడానికి నిరాకరించింది. అంతేగాక.. ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా చౌదరిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం ఆసక్తిదాయకమైన అంశం.


టీడీపీ నేత సుజనా చౌదరి ఆస్తులు సీజ్ ... టీడీపీ పతనం మొదలైందా...!

తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ వేధిస్తోందని చౌదరి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. కాబట్టి తనకు ఈడీ విచారణ నుంచి మినహాయింపును ఇవ్వాలని కోర్టును కోరాడు. ఈ విషయంలో కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విచారణ నుంచి మినహాయింపును ఇవ్వలేమని.. చౌదరి ఈడీ విచారణకు హాజరు కావాల్సిందే అని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరడంతో.. ఈడీ విచారణ కూడా ఢిల్లీలోనే జరుగుతుందని స్పష్టం అవుతోంది.


టీడీపీ నేత సుజనా చౌదరి ఆస్తులు సీజ్ ... టీడీపీ పతనం మొదలైందా...!

మొత్తం ఆరువేల కోట్లరూపాయల స్కామ్ కు సూత్రధారిగా సుజనా చౌదరి పేరును పేర్కొంది ఈడీ. ఈ నేపథ్యంలో ఈయన విచారణకు ఈడీ రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం చౌదరి ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంటుందని సమాచారం. విచారణ మొదలు కాగానే.. చౌదరి అరెస్టు కూడా ఉండవచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. చౌదరిని ఈడీ అదుపులోకి తీసుకోవచ్చని.. తీహార్ జైలుకు తరలించవచ్చు అని ప్రచారం జరుగుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: