అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్  చనిపోయారు . దీనితో అంతర్జాతీయ ప్రముఖులు తీవ్ర ద్రిగ్బాంతిని వ్యక్తం చేశారు. అయితే కొన్నేళ్లుగా న్యూమోనియాతో బాధపడుతున్న తన తండ్రి, రాత్రి కన్నుమూసినట్టు జార్జి బుష్ ప్రకటించారు. అమెరికాను అభివృద్ధి పథంలో నడిపిన 41వ అధ్యక్షుడిగా పేరుతెచ్చుకున్నారు జార్జి బుష్ సీనియర్. ఈయన మృతిపట్ల పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

జార్జి బుష్ సీనియర్ కన్నుమూత

జార్జి బుష్ సీనియర్ ముద్దుపేరు పాపీ. చిన్నప్పట్నుంచే బుష్ లో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. దీంతోపాటు అంతర్జాతీయ రాజకీయాలు, రక్షణ రంగం అంటే బుష్ కు ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే టీనేజ్ లోనే అమెరికా నౌకాదళంలో చేరారు. ఓ యుద్ధనౌకకు ఏవియేటర్ గా కూడా పనిచేశారు. అత్యంత పిన్నవయస్సులో (19 ఏళ్లకే) ఏవియేటర్ గా పనిచేసి రికార్డు సృష్టించారు. నౌకాదళంలో పనిచేసిన అనుభవంతో అమెరికా గూఢచారి సంస్థ-సీఐఏలో బుష్ కు అవకాశం వచ్చింది.

Image result for george bush HW

ఆ తర్వాత పూర్తిగా తండ్రి వ్యాపార లావాదేవీలకే పరిమితమయ్యారు బుష్. తను స్థాపించిన పెట్రోలియం కార్పొరేషన్ ను నంబర్ వన్ స్థానంలో నిలిపారు. అదే సమయంలో అనుకోకుండా అమెరికా రాజకీయాలపై బుష్ కన్నుపడింది. అమెరికా అధ్యక్షుడిగా మంచిపేరు తెచ్చుకున్న సీనియర్ బుష్, తన పదవీకాలంలో కొన్ని దేశాల మధ్య యుద్ధాలను ప్రేరేపించారనే విమర్శలు ఎదుర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: