ఓ వైపు తెలంగాణా ఎన్నికల హోరు ఓ రేంజిలో సాగుతోంది. మరో వైపు ఏపీలో రాజకీయం కూడా మారుతోంది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉన్నందున తట్టా బుట్టా సర్దుకుంటున్నారంతా. టికెట్ల దగ్గర మొదలైన అనుమానాలు చివరకి పార్టీకి గుడ్ బై చెప్పేలా చేస్తున్నాయి. ఏపీలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటున్నాయి.


రావెలతో మొదలు :


ఇక ఏపీలో తొట్ట తొలి వికెట్ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో మొదలైంది. ఆయన టీడీపీకి రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యే. పవన్ పక్కన చేరిపోయారు. ఈ టైంలో మరో చర్చ ఇక్కడ మొదలైంది. మరెంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతారన్నదే ఆ చర్చ. దీనిపైన టీడీపీ హైకమాండ్ కూడా ద్రుష్టి పెడుతోంది.  ఏపీలోని  కొన్ని కీలక జిల్లాల‌ నుంచి పలువురు ఎమ్మెల్యే తమ్ముళ్ళు పార్టీకి రాజీనామా చేస్తారని టీడీపీ పెద్దల వద్ధ సమాచారం ఉందంటున్నారు.


ఆ జిల్లాల నుంచి :


ఏపీ రాజధాని ప్రాంతం గుంటూర్ జిల్లా నుంచి మరో ఇద్దరు టీడీపీని వీడిపోతారని చెబుతున్నారు. అందులో మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు ఉన్నారంటున్నారు. ఇక క్రిష్ణా జిల్లా నుంచి కూడా ఇద్దరు జనసేన వైపుగా చూస్తున్నారని చెబుతున్నారు. అలాగే జనసేనకు  బలమైన జిల్లాగా చెబుతున్న తూర్పు గోదావరి జిల్లా నుంచి కనీసంగా  ముగ్గురు పార్టీని వీడుతారని అంటున్నారు. మరి వీరంతా పవన్ పార్టీలో చేరి తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటారని చెబుతున్నారు.


అదే కారణమా :


ఏపీలో చూసుకుంటే వైసీపీ బెర్తులు దాదాపుగా నిండిపోయాయి. ఇక టీడీపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు, పార్టీలో చేరిన వారు చాలామంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ తొ పొత్తు వల్ల కొన్ని సీట్లు త్యాగం చేయాల్సివ‌స్తోంది. దీనికి తోడు, చాలామంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని టీడీపీ అంతర్గత సర్వేలో తేలింది. దాంతో హై కమాండ్ ప్రక్షాళన మొదలుపెట్టింది. అదే కనుక జరిగితే చాలా మందికి టికెట్లు రావు. ఈ సంగతి ముందే పసిగట్టిన కొందరు పార్టీని వీడి బయటకు వస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో పార్టీ పరిస్థిపై తెలంగాణా ఎన్నికలు ముగిసిన తరువాతనే చంద్రబాబు పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: