జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసులో చంద్రబాబునాయుడుకు కోర్టు పెద్ద షాకిచ్చింది. హత్యాయత్నం ఘటన కేంద్రప్రభుత్వ పరిధిలోని ఎయిర్ పోర్టులో జరిగితే రాష్ట్రప్రభుత్వం ఎలా విచారిస్తుందని న్యాయమూర్తి అడిగారు. న్యాయమూర్తి ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోయారు. దాంతో హత్యాయత్నం ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్ విచారణను వెంటనే నిలిపివేయాలంటూ హై కోర్టు ఆదేశించింది. కోర్టు తాజా ఆదేశాలతో చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలినట్లైంది.

 

సెప్టెంబర్ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. తనపై హత్యాయత్నం జరిగిందని జగన్ అంటే చంద్రబాబు ఎగతాళి చేశారు. తనపై తానే జగన్ దాడి చేయించుకున్నాడంటూ చాలా ఎగతాళి చేస్తు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పైగా దాడి కూడా సానుభూతి కోసం, ప్రచారం కోసమే జగన్ చేయించుకున్నట్లు నిర్ధారించేశారు. అయినా ఘటన జరిగింది కాబట్టి సిట్ తో విచారణ  చేయిస్తామని ప్రకటించారు. చంద్రబాబు ధోరణి చూసిన తర్వాత సిట్ విచారణపై తమకు నమ్మకం లేదంటూ జగన్ అండ్ కో ఎంత మొత్తుకున్నా చంద్రబాబు లెక్క చేయలేదు.

 

దాంతో సిట్ విచారణకు జగన్ సహకరించకుండా నేరుగా హైకోర్టులో పిటీషన్ వేశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణ చేయిస్తే కానీ నిజాలు బయటకు రావని జగన్ వాదిస్తున్నారు. అదే విషయమై కోర్టులో కూడా వాదనలు వినిపిస్తున్నారు. గడచిన 20 రోజులుగా విచారణ చేస్తున్న కోర్టు ఈరోజు అడ్వకేట్ జనరల్ కు బాగా తలంటింది. కేంద్రప్రభుత్వ పరిధిలో జరిగిన ఘటనను రాష్ట్రప్రభుత్వం ఎలా విచారిస్తుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. దాంతో మొత్తం సిట్ విచారణను నిలిపేస్తు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సిట్ విచారణ ఎలా చేయిస్తారో సంజాయిషీ చెప్పాలంటూ బుధవారానికి కోర్టు విచారణను వాయిదావేసింది. న్యాయమూర్తి ధోరణి చూస్తుంటే జగన్ వాదనలో వాస్తవముందని చెప్పకనే చెబుతున్నట్లుంది. మరి బుధవారం ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: