ఏపీలో రాజకీయం శరవేగంగా మారుతోంది. పొరుగున ఉన్న తెలంగాణా ఎన్నికలు ఇపుడు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ని ప్రతిబింబిస్తున్నాయి. అక్కడ వేస్తున్న అడుగులు, రాజకీయ సమీకరణలు రేపటి ఏపీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ కాబోతున్నాయి. ఎడముఖం పెడముఖం నాయకులంతా కలసిపోతున్నారు. మరి ఆ పరిణామాలు ఏపీపై ఎలా ప్రభావం చూపిస్తాయో చూడాలి


బాబుతో కామ్రెడ్ :


తెలంగాణా ఎన్నికలు కాదు కానీ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ చంద్రబాబు చెతులు కలిపారు, మధ్యలో రాహుల్ గాంధీని పెట్టుకుని మరీ ముచ్చట్లకు తెర లేపారు. అక్కడ ప్రజా కూటమి పేరు మీద సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇపుడు ఏపీలోనూ ఆ కాంబోను విస్తరించాలని కొత్త ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ఏపీ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది.


జనసేనతో ఇక్కడ:


ఇక ఏపీ విషయానికి వస్తే జనసేనతో వామపక్షాలు కలసి ప్రయాణం చేయాలనుకుంటున్నాయి. ఇంతలో తెలంగాణాకు ముందస్తు రావడంతో అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ తో బాబు చేతులు కలపడం, సీపీఐ కూడా జత కలవడం జరిగిపోయాయి. ఇపుడు మోడీ పేరు చెప్పి దేశవ్యాప్తంగా కూటమి కడుతున్న సీన్ కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీలోనూ ఆ పేరు చెప్పి కామ్రేడ్స్ ని బాబు, కాంగ్రెస్ దగ్గరకు తీస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా కనుక జరిగిగే జనసేన ఏ వైపు ఉంటుందో చూడాలి.


జగన్ పైనే గురి:


ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి రాకూడదన్న లక్ష్యంగానే రాజకీయం సాగుతుందన్నది తెలిసిందే. ఇపుడు జగన్ ఏపీలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవడంలేదు. ఆయన ఒంటరిగానే వస్తానని చెబుతున్నారు. మరి అదే నిజమైన ఏపీలో అవతరించబోయే ప్రజా కూటమిని రేపటి రోజున జగన్ గట్టిగా ఎదుర్కోవాలన్న మాట. అంటే జగన్ ఏపీ కేసీయార్ అవుతారన్న మాట. అక్కడ కేసీయార్ గెలిస్తే జగన్ కి జోష్ వస్తుంది. పొరపాటునా ఓడితే ఇక్కడ ప్రజాకూటమికి కొత్త ఊపిరి అందించినట్లే. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: