రేవంత్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు కొడంగల్ లో ఇంకా హీట్ ను పెంచుతుంది. అయితే రేవంత్ అరెస్ట్ ను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పు బడుతున్నారు . ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వస్తాడన్న నేపథ్యంలో.. అక్కడ బంద్ అంటూ ప్రకటించాడు రేవంత్ రెడ్డి. ఈ దూకుడే మొదటి నుంచి రేవంత్ ను బద్నాం చేస్తున్నది. ఇప్పుడూ అదే జరిగింది. ఎవడి ప్రచారం వాడు చేసుకోండన్నట్టుగా.. రేవంత్ మాట్లాడి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి అరెస్టుకు అవకాశం ఉండేదేకాదు. ఎలాగూ తనకంటూ హెలీకాప్టర్ ఇచ్చారు.. దాంతో ఈరోజు మరోచోట ప్రచారం చేసుకోవడానికి వెళ్లి ఉంటే ఇంత సీన్ క్రియేట్ అయ్యేదేకాదు. ఇక్కడ రేవంత్ చేష్టలు కూడా తప్పుపట్టడానికి అవకాశం ఇస్తున్నాయి.

Image result for revanth reddy arrest

ఇక రేవంత్ అరెస్టు చాలా అరాచకం అంటూ కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. మరి ఇలాంటి అరాచక చేష్టలకు కేరాఫ్ అయిన చంద్రబాబు నాయుడును పక్కన పెట్టుకుని వారు ఇలా మాట్లాడుతూ ఉండటం విశేషం. ఏపీలో ఏం జరుగుతోందో తెలియదా? తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో హైటెన్షన్ పరిణామాల మధ్యన ఇలా రేవంత్ అరెస్టు జరిగింది. అయితే.. ఏపీలో ఇప్పుడు  కూడా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు పర్యటించాలంటే అక్కడ స్థానిక వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తారు. అలాగే ఏవైనా హక్కుల కోసం పోరాడుతున్న ప్రజాసంఘాల వాళ్లను తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇది ఏపీలో ఆనవాయితీ.

Image result for revanth reddy arrest

చంద్రబాబు నాయుడు రాయలసీమలో ఎక్కడ వెళ్లినా.. అంతకు రెండురోజుల ముందే సీమ హక్కుల కోసం గొంతెత్తే వారందరినీ అరెస్టు చేస్తూ ఉంటారు. సీమలో హైకోర్టు పెట్టాలనే డిమాండ్ చేసే లాయర్లను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టడం రొటీన్ గా జరిగే అంశమే. ఇక చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ స్థానిక వైసీపీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటారు. హౌస్ అరెస్టులు చేస్తూ ఉంటారు. వాళ్లేమీ బాబును అడ్డుకుంటామని ప్రకటించి ఉండరు. అయితే.. ముందు జాగ్రత్త చర్యగా అలా వ్యవహరిస్తుంటుంది ఏపీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: