రేవంత్ అరెస్ట్ ఇప్పడూ కొడంగల్ నియోజక వర్గాన్ని హీట్ ఎక్కిస్తుంది. అయితే  144 సెక్షన్, వేలమంది పోలీసులతో పహారా.. ఇదీ ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. కోస్గిలో కేసీఆర్ బహిరంగ సభ కోసం ఇంతలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోస్గిలో కేసీఆర్ సభకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీకి పిలుపునివ్వడంతో తాజా పరిణామాలు చకచకా జరిగాయి. ఆందోళనలు, అలజడులు ఏమాత్రం పైకి కనిపించకూడదని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.

Image result for revanth reddy arrest

దీంతో వేకువ జామున 3గంటలకు 100మంది పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరికొంతమంది కాంగ్రెస్, టీడీపీ నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి ఎన్నికలంటే ఎవరికి భయమో అర్థమవుతూనే ఉంది. ఒకపార్టీ ప్రచారం చేస్తుంటే, మరో పార్టీ నిరసన తెలపడం ఎక్కడైనా జరిగేదే. మరీ భుజాలు తడుముకుంటున్నట్టు కేసీఆర్ ఈ నిరసనలను ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎక్కడా, ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి లేదే.

Image result for revanth reddy arrest

ఏకంగా కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్ పెట్టి మరీ సభ పెట్టుకోవడం అవసరమా? కూటమిలో పార్టీలకు తానంటే వణుకు అని అందుకే అందరూ జట్టుకట్టారని చెప్పుకుంటూ వస్తున్నారు కేసీఆర్. మరోవైపు బీజపీ కూడా తానంటే భయపడుతోందని అంటున్నారు. ఈ డాంబికాలు ఎలా ఉన్నా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కేసీఆర్ లో మాత్రం ధైర్యం తగ్గుతూ వస్తుందనే విషయానికి తాజా ఘటనలే ఉదాహరణ. పైకి ఎంతో గంభీరంగా కనిపించే కేసీఆర్.. 13 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీచేస్తున్న టీడీపీ అంటే ఎందుకు భయపడుతున్నారు?

మరింత సమాచారం తెలుసుకోండి: