వైఎస్ జగన్ రాజకీయంగా రాటుదేలారు. ఒక ఎన్నికల్లో జరిగిన పరాభవం ఆయనకు పాఠాలు నేర్పిందనే భావించాలి. దాంతో ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు. జనాన్ని  చూసి పొంగిపోవడం, పొగడ్తలకు పడిపోవడం వంటివి ఇపుడు జగన్  దూరం పెట్టారనే చెప్పాలి. జగన్ ఇపుడు  వేసే ప్రతి అడుగు జాగ్రత్తగానే  పడుతోంది. ఆయన రేపటి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.


టీడీపీ ఓటమి :


ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ ఏపీలో ఓటమి పాలు అవుతుందని జగన్ లెక్క వేస్తున్నారు. అందుకు ఆయన చాలా విశ్లేషణలే  దగ్గర పెట్టుకున్నారు. అప్పట్లో బాబుకు సహకరించిన బీజేపీ, పవన్ కళ్యాణ్ ఇపుడు వేరుగా ఉన్నారు. అలాగే అయిదేళ్ళా పాలన తరువాత సహజంగానే ప్రజలలో  వ్యతిరేకత ఉంటుంది. ఇక ఎన్నికల్లో బాబు ఇచ్చిన ఆరు వందల హామీలలో ఛాలా  వాటిని టచ్ చేయలేదు. విభజన ఏపీలో అభివ్రుధ్ధి అన్నది అస్సలు లేదు. రాజధాని నిర్మాణం అలాగే ఉంది. పోలవరం కూడా ముందుకుపోవడంలేదు.

 దీనికి తోడు రాజకీయ  విశ్వసనీయతను  బాబు బాగానే దెబ్బతీసుకున్నారని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అయిదేళ్ళకు ముందు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ని తిట్టారు, ఇపుడు అదే కాంగ్రెస్ తో చెట్టాపట్టాలు వేస్తున్నారు. దీంతో ఈ కారణాలన్నీ కలసి ఏపీలో టీడీపీకి వచ్చె ఎన్నికల్లో ఘోర పరాజయం  అందిస్తాయని జగన్ గట్టిగా భావిస్తున్నారు.


పోటీయే కాదు:


ఈ రకమైన పక్కా లెక్కలతోనే రాజాం పాదయాత్రలో జగన్ వచ్చేది రాజన్న రాజ్యమేనని ధీమాగా చెబుతున్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ తమకు పోటీయే కాదని జగన్ అంటున్నారు. బాబు పాలనలో అన్ని వర్గాలూ ఇబ్బందులు పడ్డాయని, మరో మారు ఆయనని నమ్మడానికి ఎవరూ సిధ్ధంగా లేరని కూడా జగన్ చెప్పుకొస్తున్నారు. 

బాబు విషయం తీసుకుంటే ఆయనలో రాజకీయ చాణక్యుడు ఉన్నాడు. ఎన్నికల వేళ ఆయన వేసే ఎత్తుకు. వ్యూహాలు అందుకోవడం ఎవరి వల్లా కాదు, మరి జగన్ వాటి మీద కూడా ఓ కన్నేసి ఉంచితేనే ఆయన అనుకుంటున్న ఘన విజయం దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి జగన్ లెక్కలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో. 


మరింత సమాచారం తెలుసుకోండి: