తెలంగాణా ఎన్నికల పోలింగ్ కు ఒక్క రోజు ముందు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో ఇంకా అయోమయమే కనిపిస్తోంది. ఇంతటి అయోయం గతంలో ఎప్పుడూ కనబడలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత అయోమయానికి కారణం ఏమిటంటే, ఇటు టిఆర్ఎస్ అటు ప్రజాకూటమిలో ఇంకా అభ్యర్ధులు గెలుపుకోసం నానా అవస్తలు పడుతుండటమే. దానికితోడు చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు బిజెపి అభ్యర్ధులు, ఇండిపెండెంట్లు గట్టిపోటీ ఇస్తున్నారు. బిజెపి 118 నియోజకరవర్గాల్లో పోటీ చేస్తున్నా చాలా నియోజకవర్గాల్లో మంచి పోటీనే ఇస్తోంది.

 

అయితే, కమలం పార్టీ ఓ 6 చోట్ల గెలుస్తే చాలా ఎక్కువే అన్న అంచనాలున్నాయి. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పోటా పోటీగా ప్రచారంలో ఉన్నారు. దాంతో చాలా నియోజకవర్గాల్లో  ఓటరు నాడి అందకపోవటంతో మీడియాలో  అయోమయం కనిపిస్తోంది. తాము గెలవకపోయినా గెలిచేంత సీన్ ఉన్న టిఆర్ఎస్ లేదా ప్రజాకూటమి అభ్యర్ధుల గెలుపు అవకాశాలను దెబ్బ తీసే స్ధాయికి బిజెపి అభ్యర్ధులు  చేరుకున్నారనటంలో సందేహం లేదు. ఇటువంటి పరిస్ధితి కనీసం 40 నియోజకవర్గాల్లో కనిపిస్తోందన్నది ఓ అంచనా.

 

ఇక, వీరు కాకుండా ఇండిపెండెంట్లు ఎలాగూ ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టిక్కెట్లు దక్కని వాళ్ళే ఇండిపెండెట్లుగా నామినేషన్లు వేశారు. పేరుకు ఇండిపెండెంట్లే కానీ వారు కూడా గట్టి అభ్యర్ధులే. అందుకే ఎన్నికల సర్వేల్లో ఆంధ్రా ఆక్టోపస్ గా పాపులరైన లగడపాటి రాజగోపాల్ కూడా పదిమంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారంటూ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిస్తే పార్టీలను, అభ్యర్ధులను టెన్షన్లోకి  పడేశాయి. ఇటువంటి పరిస్దితి గతంలో ఏ ఎన్నికలోను కనిపించలేదని విశ్లేషకులు చెబుతున్నారంటేనే ఎంతటి అయోమయం నెలకొందో అర్ధమైపోతోంది.

 

టిఆర్ఎస్ లో కంటిన్యూ అవుతున్న అంతర్గత విభేదాలు, అభ్యర్ధులపై పార్టీలోనే పెరిగిపోయిన వ్యతిరేకత తదితర కారణాలతో చివరకు కెసియార్ కూడా అభివృద్ధిని పక్కనపెట్టేసి సెంటిమెంటునే నమ్ముకున్నారు. అందుకనే చంద్రబాబునాయుడును పదే పదే కెసియార్ లక్ష్యంగా చేసుకున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. అదే సమయంలో ప్రజాకూటమి అభ్యర్ధుల్లో కూడా ఇబ్బందులున్నాయి. కెసియార్ సెంటిమెంటును అడ్డుకునేందుకు ప్రజాకూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాల్సిందే. ఎందుకంటే, ప్రజాకూటమిలో జనాకర్షక నేత అంటే రేవంత్ రెడ్డి తప్ప మరోకరు కనిపించటమే లేదు.

 

ప్రచారం విషయం తీసుకుంటే అందరూ ఉదృతంగానే చేస్తున్నారు. టిఆర్ఎస్ చీఫ్ కెసియార్ లో కూడా టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు 100 సీట్లకు తగ్గదని చెబుతూనే మరోవైపు టెన్షన్లో ఉన్నారు. అదే సమయంలో ప్రజాకూటమికి నేతృత్వం వహిస్తున్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తమకు 85 సీట్లు తగ్గదని చెబుతున్నా కూటమిలోని ఇతర నేతల్లో అనుమానాలు కనిపిస్తున్నాయి. దాంతో ఓటరు నాడిని పట్టుకోవటంలో అమోమయం స్పష్టంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: