అసలే అమావాస్య... తిధిని చూసుకుని ముందుకు వెళ్ళాలంటారు. ఇది నిజమే. కానీ అవన్నీ వ్యక్తిగతమైన వ్యవహారాలపుడు  మాత్రమే చేయగలం. పాపం అభర్ధులు కూడా మంచి ముహూర్తం చూసుకునే నామినేషన్ వేశారు. ప్రచారం చేస్తూ వచ్చారు. తీరా జాతకం తేలే వేళకు మాత్రం అమ్మోరులా అమావాస్య వచ్చి కూర్చుంది. మరి అది ఎవరికి మేలు, మరెవరికి చేటు..


అమావాస్యతో పోలింగ్ :


అమావాస్యతో పోలింగ్ జరుగుతోంది. బీజేపీ వారు పాటించే హిందూ సంప్రదాయం ప్రకారం చూసుకున్నా, మిగిలిన పార్టీల సెంటిమెంట్ ను ఫాలో అయినా కూడా ఇది కూడని ముహూర్తం, రాకూడని తిధి. అయినా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజుని డిక్లేర్ చేసిన తరువాత ఎవరేమంటారు. అందువల్ల ఈ రోజే తెలంగాణా తీర్పు ప్రజలు చెబుతున్నారు. తీర్పు చెప్పే జనానికి బాగానే ఉన్నా జాతకం చూసుకుని కంగారు పడే పార్టీలు, నాయకులకు మాత్రం బేజారుగా ఉందిపుడు.


వారం మంచిదే:


ఇక పోతే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా వారం మాత్రం మంచిదేనని అంటున్నారు. శుక్రవారం విజయానికి  సంకేతమైన వారమేనని పండితులు చెప్పడంతో ఆ విధంగా పార్టీలు, అభ్యర్ధులు కొంత ఊరట చెందుతున్నారని టాక్. ఇదిలా ఉండగా అన్ని ముహూర్తాలు చూసుకుని బరిలో దిగినా గెలుపు గ్యారంటీ ఏమైనా ఉందా అని కూడా కొంతమంది అంటున్నారు. ఓటరన్న దయ, అభ్యర్ధికి ప్రాప్తం అని వేదాంతం వల్లించేవారూ ఉన్నారు. మొత్తానికి అన్ని పార్టీలకు గెలుపు ఇపుడు కావాలి.
 అలాగే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన అభ్యర్ధులు విజయతీరం చేరాలి. మరి ఎంత అమావాస్య  అయినా ఎవరో ఒకరి ఆశలను తీరుస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఎవరు విజేత అవుతారో అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. మొత్తానికి ప్రశాంత వాతావరణంలో తెలంగాణా ఎన్నికల పోలింగ్ మొదలైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: