జగన్ పాదయాత్ర నభూతో... నభవిష్యత్ అన్నట్లు సాగుతుంది. ఏ భహిరంగ సభ పెట్టిన జనాలు ఉప్పెనలా కదలి వస్తున్నారు నిజానికి రాయలసీమ లో కంటే ఉత్తరాంధ్ర లో జనాలు భారీగా కదలి వస్తున్నారు. తాజాగా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని చిలకపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ ఏం మాట్లాడారన్న విషయం పక్కన పెడితే, ఈ సభకి జనం పోటెత్తడం చూసి వైసీపీ అధినేత ఆశ్చర్యపోవడం విశేషంగానే చెఫ్పుకోవాలి.


సొంతజిల్లా కడపలో కావొచ్చు, రాయలసీమలోని ఇతర జిల్లాల్లో కావొచ్చు.. ఉభయ గోదావరి జిల్లాల్లో కావొచ్చు.. మొత్తంగా ఇప్పటిదాకా ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించిన 13 జిల్లాల్లో కావొచ్చు.. జగన్‌ చాలా బహిరంగ సభలు నిర్వహించారు. వాటన్నిటినీ మించి, ఎచ్చెర్ల - చిలకపాలెంలో నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తడం గమనార్హం. ఓ దశలో పోలీసులు, జనాన్ని కంట్రోల్‌ చేయలేకపోయారంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. 


ఇక, తెలంగాణలో ఎన్నికల ప్రచారం పేరుతో.. రాష్ట్ర సమస్యల్ని గాలికొదిలేశారని చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో మొసలి కన్నీరు కార్చుతున్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని జగన్‌ నిలదీశారు. కాగా, ఈ స్థాయి జన సంద్రం, ప్రజాసంకల్ప యాత్రలో ఇప్పటిదాకా తాము చూడలేదని వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: