శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారిద్దరిలో సీనియర్ మంత్రి చక్రం తిప్పేస్తున్నారు. ఆయన చంద్రబాబుకు బాగా సన్నిహితులు, ఒకసారి పార్టీ మారి మళ్ళీ వచ్చినా కూడా బాబు దగ్గర ప్రాపకం బాగానే సంపాదించుకున్నారు. అయితే జనం మాత్రం పోయిన ఎన్నికల్లో అత్తెసెరు మార్కులే వేసి గెలిపించారు. అపుడున్న ఊపు ఇపుడు లేదు. మరి రేపటి ఎన్నికల్లో ఆయన సంగతేంటో..


కళా టార్గెట్ :


శ్రికాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులను జగన్ టార్గెట్ చేసారిపుడు. జోరుగా సాగుతున్నా ఆయన పాదయాత్రలో జనం వెల్లువలా వస్తున్నారు. ఇదిలా ఉండగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో జగన్ కళా వెంకటరావుపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇంటిపేరు కళా కాదు, కమీషన్ల  వెంకటరావుగా మార్చుకోవాలంటూ సెటైర్లు వేశారు. సీనియర్ మంత్రిగా ఉంటూ అభివ్రుధ్ధి ఏమైనా  చేశారా అని జనాన్నే ప్రశ్నించారు. ఇక్కడ అంబేద్కర్ వర్శిటీని వైఎస్సార్ మంజూరు చేస్తే దాన్ని అభివ్రుధ్ధి చేయకుండా చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ పాఠశాలలు సైతం మూతవేశారని విమర్శలు చేశారు.


తేడా కొడుతోంది:


ఇదిలా ఉండగా ఎచ్చెర్లలో కళా వెంకటరావు పోయిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడు కావడంతో ఆయన ఓటమి కోసం వైసీపీ శ్రేణులు గట్టినా పనిచేస్తున్నాయి. దానికి తోడు జనంలోనూ వైసీపీకి ఆదరణ చాలా బాగా ఉంది.జగన్ ఎచ్చెర్లలోని చిలకలపలెం  వేదికగా నిర్వహించిన బహిరంగ సభ స్థానికంగా చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ చూడని  విధంగా చిలకపాలెం కూడలి అంతా జనంతో కిక్కిరిసి పో యింది. 



జగన్ సైతం వచ్చిన జనాన్ని చూసి రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగం చేశారు. అన్ని సమీకరణలు సరి చూసుకుని మరీ కళా వెంకట రావుపై జగన్ మాటల దాడి చేశారని అంటున్నారు. మొత్తానికి ఈసారి ఎచ్చెర్లలో కళా విజయం డౌట్లో పడిందని జగన్ సభకు వచ్చిన జనమే అందుకు నిదర్శనమని వైసీపీ నేతలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: