హోరా హోరీగా పోటీ పడుతున్న పార్టీల జాతకం ఈ రోజు తెలనుంది. తెలంగాణాలో మొదలైన పోలింగ్ ప్రశాంతగా సాఫీగా సాగుతోంది. అక్కడకక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నా మొత్తం మీదా బాగానే పోలింగ్ జరుగుతోందని తొలి వార్తలు నిర్ధారణ చేస్తున్నాయి. పోలింగ్ బాగా జరగాలని అన్ని పార్టీలు మొక్కుకుంటున్నాయి. పోలింగ్ శాతం కూడా పెరగాలని ఆశిస్తున్నాయి.


ఎక్కువ పోలింగ్ జరిగితే:


ఎక్కువ పోలింగ్ జరిగితే ఎవరికి లాభమన్న చర్చ కూడా ఇపుడు జరుగుతోంది. నిజానికి మనకున్న ట్రడిషనల్ ఎన్నికల విధానం ప్రకారం చూస్తే ఎక్కువ పోలింగ్ జరిగితే అది విపక్షాలకు మేలు చేస్తుందన్న అభిప్రాయం గట్టిగా ఉంది. అయితే గత కొంతకాలంగా అది తప్పు అని కూడా రుజువు అవుతోంది. ఉత్తర భారతాన, ఇంకా చాలా రాష్ట్రాలలో ఎక్కువ పోలింగ్ జరిగినా విపక్షాలతో సమానంగా  అధికార పార్టీ కూడా సీట్లు గెలుచుకున్న దాఖాలాలు ఉన్నాయి.అంతే కాదు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఓటర్ల చైతన్యమా :


ఎక్కువ పోలింగ్ జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది ఓటర్లలో చైతన్యం పెరగడం. ఓటర్లు గతంలో తమ ఓటు హక్కు గురించి పెద్దగా ఆలోచన చేసెవారు కాదు. కానీ పోటా పోటీ ప్రచారాలు, ప్రభుత్వ  విధానాలు, రాజకీయాల గురించి అవగాహన వంటివి వారిని పోలింగ్ బూతుల వైపునకు నడిపిస్తున్నాయి. అలాగే స్వచ్చంద సంస్థలు  కూదా ఈ విషయంలో కీకలమైన పాత్ర పోషిస్తూ ఓటర్లను మేలుకొల్పుతున్నాయి. అన్నింటికంటే కూడా అభ్యర్ధులు తమకు తాముగా ఓటర్లను పోలింగ్ స్టేషన్ల వైపునకు తీసుకువచ్చేందుకు ఎక్కువ ద్రుష్టి పెడుతున్నాయి. అక్కడ కూడా పోటా పోటీగా వ్యవహారం సాగడంతో సహజంగానే పోలింగ్ శాతం పెరుగుతోంది.


తెలంగాణాలో పెరగొచ్చు:


రాజకీయంగా బాగా చైతన్యం ఉన్న తెలంగాణాలో ఈసారి పోలింగ్ శాతం బాగా పెరగవచ్చునని అంటున్నారు. అన్ని పార్టీలు కూడా పోలింగ్ పెరిగేలా చర్యలు తీసుకోవడంతో అది మరింతగా పెరుగుతుందని అంటున్నారు. మరి సర్వెల్లో చెప్పినట్లుగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందన్నది కూడా ఇక్కడ ప్రశ్నగా ఉంది. కానీ ఏ ఎన్నికకు ఆ ఎన్నిక సెపరేట్ గా మారుతున్న వర్తమాన కాలంలో పోలింగ్ పెరిగిన దన్ని బట్టి విజేతను నిర్ణయించలేమంటున్నారు. బ్యాలెట్ బాక్స్ లో  ఆఖరి ఓటు కూడా జాతకాన్ని మారుస్తుందని చెబుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: