ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఆమెకే తన ఓటు అంటూ మనసులో మాట చెప్పేశాడు. కొన్నాళ్ళుగా మీడియాకు చిక్కని జూనియర్ పోలింగ్ సందర్భంగా దొరికేశాడు. జూబ్లిహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూలులో తన తల్లి భార్య ప్రణతితో కలిసి ఓటేసేందుకు క్యూలో నిల్చున్నారు. దాంతో ఈ సందర్భంగా ఎన్టీఆర్ క్యూలైన్లో నిల్చోవడంతో అభిమానులు మీడియా పోటెత్తింది. అడిగిన అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ ఎన్టీఆర్ సందడి చేశారు. 


ఓటు బాధ్యత :


అనంతరం మీడియాతో మాట్లాడారు.. ‘ఓటు మన బాధ్యత అని.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాజ్యాంగం - దేశం మనకు కల్పించిన హక్కు ఇది అని.. ఆ హక్కును నెరవేర్చాలని కోరారు. ఓటేయకపోతే సమస్యలపై ఫిర్యాదు చేసే హక్కును కోల్పోతారని చెప్పారు. ఓటు వేయాలని ఒకరు చెప్తే వచ్చేది కాదని.. మనసా - వాచా - కర్మణా మనకు అనిపించాలని చెప్పారు. 


అక్క గెలవాలి :


ఇదిలా ఉండగా మీడియా ఎన్టీఆర్ని వదలకుండా ఆ కీలకమైన ప్రశ్నని సంధించింది. కూకట్ పల్లిలో మీ అక్క సుహాసిని పోటీలో ఉన్నారు కదా. మరి ఆమె విషయమేంటని గుచ్చి మరీ అడిగింది. దానికి బదులిచ్చిన ఎన్టీఆర్ ఆమె తన అక్క సుహాసిని కూకట్ పల్లిలో గెలవాలని కోరుకుంటున్నట్టు ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.  తాను కూకట్ పల్లి ప్రజలకు చెప్పేది ఇది ఒక్కటే అని వివరించారు.
మొత్తానికి ఎలగైతేనేం ఎన్టీఆర్ మద్దతు మాత్రం సుహాసిని అక్కకు దక్కింది. ప్రచారానికి రాలేదని హోరెత్తించిన మీడియా చివరకు ఎన్టీఆర్  నోటి మాట ద్వారా పోలింగ్ వేళ ఈ రకంగా అనుకూలంగా మద్దతు సేకరించేసింది. సో. అక్క గెలుపే తమ్ముడు కోరిక అని చెప్పేసింది. ఎన్టీఆర్ ఓటు ఆమెకేనని కూడా పక్కాగా చెప్పేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: