సొంత జిల్లాలోనే చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. పేదరికంపై గెలుపు అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన చంద్రబాబును నిరుద్యోగులు దుమ్ము దులిపేశారు. ఖాళీ ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని టీచర్ నిరుద్యోగులు చేసిన డిమాండ్ పై చంద్రబాబు మండిపడ్డారు. దాంతో సిఎంపై నిరుద్యోగులు తిరగపడ్డారు. దాంతో చంద్రబాబుకు నిరుద్యోగుకు మాట మాట పెరిగింది. చివరకు నిరుద్యోగులపై మండిపడిన చంద్రబాబు కొందరిని అరెస్టులు చేయించి మిగిలిన వారిని లాఠీలతో చెల్లా చెదురు చేయించి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

 Image result for unemployment in ap

ఇంతకీ విషయం ఏమిటంటే, పేదరికంపై గెలుపు అనే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సమయంలోనే జిల్లాలోని ఉపాధ్యాయ నిరుద్యోగులందరూ అక్కడికి   చేరుకున్నారు. చంద్రబాబు మాట్లాడుతున్నపుడు నిరుద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు ప్రారంభించారు. దాంతో తన ప్రసంగాన్ని నిలిపేసిన చంద్రబాబు వారితో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా డిఎస్సీలో పోస్టులు భర్తీ చేస్తున్నామని, నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు భృతి ఇస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసం మొదలుపెట్టారు.

 Image result for unemployment in ap

అయితే, ఆ ఉపన్యాసాన్ని నిరుద్యోగులు అడ్డుకున్నారు. 50 వేలమంది నిరుద్యోగులుంటే కేవలం 2 జిఎస్టీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఎలా సరిపోతుందంటూ నిలదీశారు. పోయిన ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలని చెబితే నమ్మి ఓట్లేసినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొడుకు లోకేష్ కు మాత్రం జాబు ఇప్పించుకుని మమ్మల్ని పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. దాంతో చంద్రబాబు జోక్యం చేసుకుని దేశంలో ఎక్కడా లేనివిధంగా వెయ్యి రూపాయల నిరుద్యోగు భృతి ఇస్తున్నట్లు చెప్పారు. దాంతో నిరుద్యోగులు మరింత రెచ్చిపోయారు. కావాలంటే మీరిస్తున్న వెయ్యి రూపాయలు కూడా మీకే ఇచ్చేస్తామని కావాలంటే ఆ డబ్బును లోకేష్ కే ఇచ్చుకోమంటూ ఎదరుతిరిగారు. దాంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతు పోలీసులను ప్రయోగించారు.

 Image result for unemployment in ap

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి లాఠీలను చూపుతూ చెదరగొట్టటంతో అంతా కలిసి చంద్రబాబును శాపనార్ధాలు పెట్టారు. నిజానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే భర్తీ చేయాల్సిన డిఎస్పీ పోస్టులను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. పైగా హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని రెండు వేల రూపాయల నుండి వెయ్యికి తగ్గించారు. అంతేకాకుండా భృతి అందుకునే నిరుద్యోగులను కూడా బాగా తగ్గించేశారు. అంటే అవసరమైన ఉద్యోగాలు భర్తీ చేయక అటు భృతి కూడా సరిగా ఇవ్వక పైగా కోత కూడా పెట్టటంతో నిరుద్యోగులందరూ చంద్రబాబుపై మండిపోతున్నారు.

==================

 


మరింత సమాచారం తెలుసుకోండి: