ఎగ్జిట్ పోల్స్ అన్ని తెరాస దే విజయమని తేల్చేశాయి అయితే ఈ నేషనల్ మీడియా సర్వే ల మీద అందరికి నమ్మకాలు పోతుంది. చాలా సార్లు ఇవి ప్రకటించిన లెక్కలన్నీ తప్పులని తేలినాయి . దానికి కారణాలు లేక్ పోలేదు. గ్రౌండ్ రిపోర్ట్ ని ఇవి సరిగ్గా అర్ధం చేసుకోక పోవడం. ఓటర్ల నాడీ పట్టుకోవడం చాలా కష్టం . చివరి రెండు రోజుల్లో కూడా సమీకరణాలు మారి పోవచ్చు. చాలా దఫాలుగా సర్వే చేస్తే కానీ కరెక్ట్ గా అంచనా వేయలేము. 

అన్ని సర్వేలను విశ్లేషిస్తే..

మరీ జాతీయ చానెల్స్ అన్ని చేశాయా .. అంటే ఈ విధంగా చేయలేదని చెప్పవచ్చు. అందుకే తెలంగాణ విషయం లో ఎగ్జిట్ పోల్స్ లెక్కలను పరిగణ లోకి తీసుకోలేము. అయితే ఎందుకో గాని లగటిపాటి సర్వే గ్రౌండ్ రియాలిటీస్ తో చేసినట్టు అందరూ అనుకుంటున్నారు. లగడపాటి జోస్యం ప్రకారం మహాకూటమి పవర్ లోకి రాబోతోంది. మరి జాతీయ మీడియా ఎందుకలా? ఆ సంగతి ఏమో కానీ, లగడపాటి తన క్రెడిబులిటీ పొగొట్టుకునే పనిచేయరు.


లగటి పాటి సర్వే నిజం కాబోతుందా... అందుకే కేటీఆర్, కేసీఆర్ మౌనం...!

రేపు ఫలితం తేడా వస్తే, ఆయనను మామూలుగా దుయ్యబట్టరు. అది తెలిసీ ఇంత ధైర్యంగా ఫలితాలపై జోస్యం చెప్పారు అంటే, ఆయన దాన్ని ప్రగాఢంగా నమ్మివుండాలి. మరోపక్క రేవంత్ రెడ్డి మీడియాతో అద్భుతంగా మాట్లాడారు. దాదాపు ఆయనే కాబోయే సిఎమ్ అన్నంత రేంజ్ లో మాట్లాడారు.ఇదంతా చూస్తుంటే జాతీయ మీడియా సర్వేలు గాలి సర్వేలు అన్న అనుమానం కలుగుతోంది. లగడపాటి మాత్రం ఇక్కడ వుండి గ్రౌండ్ లెవెల్ లో సర్వే చేసినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: