అలా జరుగుతుందా. అదే ట్రెండ్ కొనసాగుతుందా. ఎక్కడి రాజకీయం అక్కడ ఉండదా. జనం తమ బతుకుల గురించి ఆలోచన చేయరా. ఇవీ ఇపుడు పొలిటికల్ పండిట్స్ తో పాటు విశ్లేషకుల మదిలో మెదిలే ఆలొచనలు. ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ తెల్ల కాగితానికే మార్కులు వేసేస్తారా. నవీన రాజకీయం ఇలాగే ఉంటుందా. సొంత ఆలొచనలు చేయరా...


కూటమి గెలిస్తే:


తెలంగాణాలో కూటమి గెలిస్తే ఏపీలో టీడీపీకి ఘన విజయం ఖాయమట. లాజిక్ కి అందని ఈ విషయాన్ని టీడీపీ నాయకులు చెబుతూ అపుడే సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ కేసీయార్ ఓడిపోతే ఇక్కడ చంద్రబాబు గెలుస్తారట. ఇదేమి లాజిక్కో మరి అర్ధం కావడం లేదు. ప్రజా కూటమిలో టీడీపీ ఉంది కాబట్టి ఆ పార్టీ విజయం ఇక్కడ ప్రభావితం చేస్తుందని కూడా అంటున్నారు. పైగా కాంగ్రెస్ తొ పొత్తు ఏపీలో కలసి వచ్చి బాబు మళ్లీ సీఎం అవుతారని కూడా అంటున్నారు. ఓ విధంగా కూటమి అక్కడ గెలిస్తే బాబు ఇక్కడ క్యాక్ వాక్ చేస్తారని చెప్పేస్తున్నారు.


అది మరచారా : 


కొంతసేపు వారు చెప్పిన వాదన నిజమే అనుకుందాం. కానీ అక్కడ నాలుగున్నరేళ్ల పాలన తరువాత కేసీయార్ ఓడిపోయారంటే అర్ధం ఏంటి.  అధికారం లో ఉన్న పార్టీకి ప్రజా వ్యతిరేకత గట్టిగా ఉన్నట్లే కదా. ఎన్నో పధకాలు చేశామని, మిగులు రాష్ట్రమని చెబుతున్న తెలంగాణాలోనే టీయారెస్ ని ఇంటికి పంపితే ఏ ఒక్క హామీ సవ్యంగా చేయని, ఇప్పటికీ రాజధాని కూడా లేని టీడీపీ పాలనకు జనం ఇక్కడ ఎందుకు సానుకూలంగా ఓటు వేస్తారు. అధికారంలో ఉన్న పార్టీలను ఓడిస్తున్నారు అంటే అవి ప్రమాద ఘటికలు అని టీడీపీ పెద్దలు మరచిపోతున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న.


యాంటి ఇంకెంబెన్సీ :


తెలంగాణా అధికార పార్టీ ఓడితే ఇక్కడ  ఏపీలో క్యాక్ వాక్ చేయాల్సింది  ప్రతిపక్ష పార్టీలే. ఎందుచేతనటే 2014 లో ఒకేమారు పవర్లోకి వచ్చిన కేసీయార్, చంద్రబాబులకు జనం ఒకేలా తీర్పు ఇస్తారు కానీ వేరు గా ఎలా ఉంటుంది. ఓటమి అంటే కేసీయార్ కే పరిమితం అవుతుందా. రెండవ మారు అధికారంలోకి రావడానికి టీడీపీ అంత పెద్ద ఎత్తున చేసిన మేళ్ళు ఏమిటన్నది దానిపైన కూడా సెటైర్లు పడుతున్నాయి. 
తెలంగాణాలో అధికారంలోకి వస్తుందనుకుంటున్న కూటమి ఇపుడు అక్కడ ప్రతిపక్షంలో ఉందన్న సంగతికి పసుపు పార్టీ పెద్దలు మరిస్తే ఎలా అని కూడా అంటున్నారు. ఇక ఏపీలో పూర్తిగా వాతావరణం వేరుగా ఉంటుంది. ఇక్కడ బలమైన వైసీపీ, ఉంది, అలాగే జనసెనా కూడా ఉంది. మరి అక్కడ కొన్ని సీట్లకు పోటీ చేసి అక్కడ గెలిచేస్తే ఇక్కడ క్యాట్ వాక్ చేస్తామని తమ్ముళ్ళు ఎందుకు అంతలా హడావుడి చేస్తున్నారో అర్ధం కావడంలేదని అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: