అదేం ప్రారబ్దమో కానీ ఏపీకి ఏమైనా కావాలంటే అది జరగదు, సాధ్యపడదు, అన్నింటికీ మించి ఏపీలో ఉన్న రాజకీయ నాయకులే దాన్ని ఎలా వెనక్కు నెట్టాలో కూడా చేసి చూపిస్తారు. విభజన జరిగినపుడు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీగా రెండు ఎన్నికల వరకూ సరిపడా ఓట్ల తాయిలం అవుతుందని ఎవరైనా అనుకున్నారా. అవసరమైతే మరో ఎన్నికకు కూడా ప్రత్యేక హోదాను వాడుకోగల సమర్ధులు మన నాయకులు, పార్టీలు.


ఒడిషా పోటీ:


అసలే హోదా విషయంలో ఆలూ లేదు, చూలూ లేదూ అని ఏపీ జనం ఏడుస్తూంటే ఇపుడు కొత్తగా ఒడిషా రాష్ట్రం కూడా రెడీ అయింది. మాకూ ప్రత్యేక హోదా కావాలంటూ ఆ రాష్ట్రానికి చెందిన బీజేడీ ఎంపీలు రేపు (మంగళవారం) జరిగే పార్ల‌మెంట్ శీతాకాల సమావేశాల్లో రభస చేయబోతున్నారట. . ఏపీకి హామీ ఇచ్చినా హోదా రాలేదు. బీజేపీ, కాంగ్రెస్ మోసం చేశాయి. ఇపుడు ఎన్నికల కోసం కాంగ్రెస్ మళ్ళీ హోదా మంత్రం జపిస్తోంది. ఈ దశలో మన పొరుగునే ఉన్న ఒడిషా హోదా కావాలంటే ఇక మనకు అది  వచ్చినట్లే మరి. 


బీహార్ కూడా :


ఇక మరో వెనకబడిన రాష్ట్రం బీహార్ కూడా హోదా అంటోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హోదా గురించి పదే పదే మాట్లాడుతున్నారు కూడా. అంతెందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగులోనే బీహార్ కాంగ్రెస్ నేతలు హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే మనకు హోదా రాదు కానీ పోటీలోకి అపుడే రెండు రాష్ట్రాలు వచ్చి చేరాయన్నమాట. ఇక మనకు ఆ పక్కన ఈ పక్కన ఉన్న తమిళనాడుకు కూడా హోదా మనకు ఇవ్వడం ఇష్టం లేదు. తెలంగాణా రాష్ట్రం కూడా తమకూ హోదా ఇవ్వాలంటోంది. కర్నాటక. రాష్ట్రం కూడా ఏపీకి హోదా ఇచ్చేస్తే చూస్తూ ఊరుకోదుగా.


రఛ్ఛ అవుతోందిగా :


ఏపీకి హోదా కావాలన్న మన నినాదం ఎవరికీ కాకుండా ఇపుడు పోతోంది. ఓట్ల రాజకీయమే రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఒడిషా, బీహార్, తెలంగాణాలను కాదని రేపు కేంద్రంలో ఏ సర్కార్ అధికారం లోకి వచ్చినా హోదా ఇవ్వరన్నది పచ్చి వాస్తవం. అయిఏ హోదా పేరు చెప్పుకుని నాడు బీజేపీ ఓట్లు ఏపీలో దండుకుంది. ఇపుడు ఓట్ల కోసం కాంగ్రెస్ మరో మారు రెడీ అవుతోంది. హోదా కోసం 
జనం నమ్మి ఓట్లు వేస్తే వేయవచ్చు కానీ. వస్తుందో రాదో మాత్రం చెప్పలేం. ఇదీ వర్తమాన భారత దేశ చిత్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: