కౌంటింగ్ కి అందరూ సిద్ధం అయిపోతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని పొలిటికల్ గా ఎవరు ఎలాంటి వారు అనేది జనాల లో ఫుల్ ఐడియా వచ్చిన తరవాత జరుగుతోన్న ఎలక్షన్ 2018 తెలంగాణా ఎలక్షన్ కావడం విశేషం.

ఈ పరిస్థితి లో తెలంగాణా లో ఏ పార్టీ కీ మెజారిటీ రాకపోతే ఏం చెయ్యాలి అనేది పెద్ద ప్రశ్న గా మారింది. కర్ణాటకా - గోవా లాగా గవర్నర్ ల నిర్ణయం కీలకం గా మారబోతోంది అంటున్నారు. ప్రజాకూటమిగా బరిలో నిలిచిన తమ కూటమికి వచ్చే స్థానాల ఆధారంగానే ప్రభుత్వాన్ని పిలువాలని - సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటూ కర్ణాటకలో మెలిక పెట్టినట్టు పెట్టవద్దని గవర్నర్ ను కోరేందుకు కాంగ్రెస్ సహా కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. 

గోవా - కర్ణాటకా లాంటి ప్రాంతాల్లో బీజేపీ గవర్నర్ లని అడ్డం పెట్టుకుని తమదైన శైలి లో రాజకీయ లబ్ది పొందింది అలాంటి వ్యూహం కర్ణాటకా లో వర్క్ అవలేదు కానీ గోవా లో కుదిరింది సో బీజేపీ కూడా ఇక్కడ అలాంటి ప్లాన్ నే వేస్తోంది అంటున్నారు. 

ఇక తెలంగాణలోనూ ప్రజాకూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటినా మొత్తంగా అత్యధిక స్థానాలు టీఆర్ ఎస్ కు వస్తే ఆ పార్టీకి ముందే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తే అంతే సంగతులు అని గ్రహించిన కూటమి నేతలు ముందస్తుగా గవర్నర్ కలిసేయత్నం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: