రాజకీయాలు ఎపుడు ఎలా ఉంటాయో తెలియదు. ఎవరిని అందలం ఎక్కిస్తాయో మరెవరిని కింద పడేస్తాయో కూడా అంతకంటే తెలియదు. ఈ పొలిటికల్ మ్యాజిక్ మజాయే వేరుగా ఉంటుంది. తెలంగాణాలో మరి కొద్ది గంటల్లో కౌంటింగ్ మొదలవుతుందనగా ఈ రోజు అనేక కీలకమైన పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు మొత్తం పొలిటికల్ ఎపిసోడ్ లో హైలెట్ మజ్లిస్ పార్టీయే మరి.


హంగ్ వస్తే మజ్లీస్ కీ రోల్ :


తెలంగాణాలో హంగ్ రావచ్చునంటూ  అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేసీయార్ ఓ వైపు, ప్రజా కూటమి మరో వైపు డీ అంటే ఢీ అని పోటీ పడిన ఈ ఎన్నికల యుధ్ధంలో ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చునని  భావిస్తున్న టైంలో మజ్లిస్ పంట పండుతుందని అంతా అనుకుంటున్నారు. మజ్లిస్ పార్టీకి పక్కాగా ఎనిమిది సీట్లు దక్కుతాయి. టీయారెస్ కి ఏ మాత్రం తగ్గినా నేనున్నాను అనేందుకు ఆ పార్టీ రెడీగా ఉంది. ఈ మేరకు ఈ రోజు కేసీయార్ ని ప్రగతి భవన్ లో కలసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ అండగా ఉంటానని అభయం ఇచ్చారు. దానికి బదులుగా కొన్ని వరాలూ కోరారట.


డీ సీఎం కోసం :


తెలంగాణాలో కొత్త సర్కార్కి సరిపడా మెజారిటీ టీయారెస్ కి రాకపోతే మద్దతుగా ఉండేందుకు మజ్లిస్ ఒకే అంది కానీ దానికి కొన్ని కండిషన్లు అప్ప్లై అవుతున్నాయని టాక్ నడుస్తోంది. మజ్లిస్ కి డిప్యూటీ సీఎం తో పాటు రెండు మంత్రి పదవులు కూడా ఇవ్వాలని అసదుద్దీన్ కేసీయార్ ని అడిగినట్లుగా భోగట్టా. అదే కనుక జరిగితే మజ్లిస్ లో కీలక నేత, అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ డిప్యూటీ అవుతారన్న మాట. మరి దీనికి కేసీయార్ కూడా అంగీకరిస్తారని అంటున్నారు. ఒక వేళ కేసీయార్ నో అంటే మజ్లిస్ తో జట్టు కట్టేందుకు మరో వైపు కాంగ్రెస్ కూడా రెడీగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద చూసుకుంటే హంగ్ కనుక వస్తే మజ్లిస్ పంట పండినట్లేనని అంటున్నారు. చూడాలి ఈవీఎంలలో ఏముందో.


మరింత సమాచారం తెలుసుకోండి: