ఈ రోజు తెలంగాణ భవిష్యత్ తేలబోతుంది. అయితే కేసీఆర్ గెలుస్తానని చాలా నమ్మకం తో ఉన్నట్టు ఉన్నాడు అందుకే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడని మాటలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తాను తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేయాలనే అంశంపై కూడా సీనియర్ నాయకులతో చర్చించినట్లు సమాచారం. గతంలో తనను విమర్శల పాలు చేసిన కొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Image result for kcr

ఈ పనిని తాను ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా గత తెలంగాణ రాష్ట్ర సమితి క్యాబినెట్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఒకే ఒక్కరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఇది నాలుగు సంవత్సరాలు పాటు కేసీఆర్ను వెంటాడింది. ప్రతిపక్షాలకు ముఖ్యంగా అన్ని పార్టీల మహిళా నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. చివరికి ఎన్నికలు ప్రచారంలో అది భాగం అయ్యింది.


దీంతో ఈ సారి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపముఖ్యమంత్రి పదవి కానీ హోం శాఖ మంత్రి వంటి కీలక పదవి కాని మహిళలకు కట్టబెట్టి తనపై మహిళల వ్యతిరేకి అని ఉన్న ముద్రను తొలగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.తాను  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఓ మహిళ చేత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. అలాగే విద్యార్ది లోకం కూడా తనపై వ్యతిరేకంగా ఉందన్న ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు విద్యార్థి సంఘం నాయకుడు బాల్క సుమన్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధిస్తే ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: