అంచనాలకు తగ్గట్టుగానే తెలంగాణాలో టీయారెస్ తన దూకుడుని ప్రదర్శిస్తోంది. ఇప్పటికి వెలువడిన తొలి ట్రెండ్స్ చూస్తే టీయారెస్ హాఫ్ సెంచరీ ని సాధించి లీడ్ల్  కొనసాగుతోంది. చాలా స్థానాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎదుతీదడం తొలి ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వెనకబడ్డారు. గద్వాలలో డీకే అరుణ, కూకట్పల్లిలో నందమూరి సుహాసిని వెనకబడ్డారు. అక్కడ టీయారెస్ 1400 ఓట్ల ఆధికతతో కొనసాగుతోంది.


ఈ ట్రెండ్ కొనసాగేనా :


నిజానికి ప్రతి ఎన్నికల ఫలితాల‌ను చూస్తూటే తొలి ట్రెండ్స్ కంటిన్యూ అయి అదే చివరి వరకూ సాగుతుంది. అలా కనుక చూసుకుంటే ఇప్పటి వరకూ టీయారెస్ ముందజలో ఉండి. ఇక కాంగ్రెస్ కూటమి సైతం తక్కువ అంచనా లేకుండా ముందుకు వస్తోంది. కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ గతంతో పోలిస్తే బాగానే ఉన్నట్లుగా తొలి ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఆ పార్టీ కట్టిన కూటమి 30 పై చిలుకు స్థానాల్లో ముందు భాగాన ఉంది. ఇక బీజేపీ, ఇతర పార్టీలు మాత్రం పెద్దగా ముందుకు రాని పరిస్థితి  తొలి ట్రెండ్స్లో కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణా ఫలితాలు ఏవిధంగా ఉండబోతాయన్నది మాత్రం కొంత క్లారిటీగానే చెబుతున్నట్లుగా అనుకోవాలి.


ఉత్తరాదిన పోటా పోటీ :


ఇక ఉత్తరాదిన చూసుకుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్  లో కాంగ్రెస్, బీజేపీల మధ్యన పోటా పోటీ వాతారణం ఉంది. దీంతో బీజేపీ పదిహేనేళ్ళ పాలన వల్ల వచ్చిన వ్యతిరేకతను కాంగ్రెస్ ఎంత వరకూ సొమ్ము చేసుకుంటుందన్నది చూడాల్సిన అవసరం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: