తెలంగాణాలో అధికారంలోకి రాగానే తామే ముఖ్యమంత్రి అవుతామని అనుకున్న వారు ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీలోని హేమా హేమీలందూ వెనకబడిపోయారు. మొదటి రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డికె అరుణ లాంటి చాలామంది ఎదురీదుతున్నారు. అయ్యింది మొదటి రౌండే కాబట్టి వాళ్ళంతా ఓడిపోయారని చెప్పేందుకు లేదు. కాకపోతే మరో రెండు రౌండ్లు కూడా ఇలాగే కొనసాగితే మాత్రం ఓటమి ఖాయమనే అనుకోవాల్సుంటుంది.

 

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురు సీనియర్ నేతలు మాత్రమే ముందంజలో ఉన్నారు. వీరి లీడ్ ను కూడా టిఆర్ఎస్ మరో రెండు రౌండ్లలో అధిగమించే అవకాశం ఎక్కువగానే కనబడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమస్య ఎక్కడ వచ్చిందంటే తమ దృష్టిని తమ గెలుపుపైన కన్నా ఇతరుల ఓటమిపైనే ప్రధానంగా పెట్టినట్లు కనబడుతోంది. ముఖ్యమంత్రిగా తమకు ఇతరులెవరూ పోటీకి రాకూడదన్న ఉద్దేశ్యంతో మిగిలిన సీనియర్ నేతలు ఓడిపోవాలనే కోరుకోని సీనియర్లు ఉండరనే ప్రచారం బాగా జరిగింది. ఇప్పటి ట్రెండ్స్ చూస్తుంటే అదే నిజమనే అనిపిస్తోంది.

 

సరే మొదటి రౌండు అయ్యేటప్పటికి టిఆర్ఎస్ అభ్యర్ధుల ఆధిక్యం వందల్లోనే ఉన్నాయనుకోండి. వందల్లోని లీడును మహాకూటమి అభ్యర్ధులు ఎప్పటికైనా అధిమించే అవకాశం ఉంది. కాకపోతే ఇదే విధమైన లీడ్ మరో మూడు రౌండ్లలో కూడా కనిపిస్తే మహాకూటమి అభ్యర్ధులు పుంజుకోవటం కష్టమనే చెప్పాలి. నిజానికి ఈ స్ధాయి ఫలితాలను కెసియార్ కూడా ఊహించి ఉందరేమో అనే అనిపిస్తోంది. ఏదో యధాలాపంగా తమకు 100 సీట్లు వస్తాయని కెసియార్ చెప్పారు కానీ దానికి హేతువును మాత్ర చెప్పలేకపోయారు. కాకపోతే యధాలాపంగా కెసియార్ చెప్పిన సంఖ్యే నిజమవుతాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: