తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఏపీలో టీడీపీకి ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్న చర్చ ఇపుడు సాగుతోంది. అక్కడ పొత్తుతో సక్సెస్ కొడితే సేమ్ సీన్ ఏపీలో రిపీట్ చేయవచ్చునని చంద్రబాబు భావించారు. అయితే అక్కడ మొత్తం బొమ్మ తిరగబడింది. పైగా ఈ పొత్తుని జనం రిసీవ్ చేసుకోలేదని మాట కూడా వినిపిస్తోంది. ఈ పరిణామాలతో ఏపీలో ఏం జరుగుతుందన్నది చర్చగా ఉంది.


తమ్ముళ్ళు నో :


ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్న తమ్ముళ్ళు తెలంగాణా ఫలితాలతో బాహాటంగానే బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీనియర్ మంత్రులు కేయీ క్రిష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు వంటి వారి గతంలోనే కాంగ్రెస్ పొత్తుని వ్యతిరేకించారు. వీరిలా గొంతు చించుకోకున్నా చాలా మంది మాత్రం లోలోపల మాత్రం రగులుతున్నారు. వారంతా తెలంగాణా ఫలితాలను చూపించి పొత్తుకు నో చెప్పవచ్చు. 


కాంగ్రెస్ కి షాకే:


ఇక చంద్రబాబు వ్యవహార శైలి చూసిన వారు సైతం ఇదే రకంగా ఆయన చేస్తారని భావిస్తున్నారు. తమ్ముళ్ళకు పొత్తు ఇష్టం లేదని చెప్పి బాబు చల్లగా కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ తో పొత్తు ఉంటుందని ఆశపడుతూ వచ్చారు. కనీసం కొన్ని సీట్లు అయినా గెలుచుకోవచ్చునని కూడా భావించారు. టీడీపీ ఇపుడున్న పరిస్థితుల్లో పొత్తుకు నో చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం తెలంగాణా ఫలితాలతో నిండా నిరాశలో మునిగిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: