తెలంగాణ ఎన్నికలు సవ్యంగా జరిగాయి. టీఆరెఎస్ ఎంతోమంది అంచనాలను తారుమారు చేస్తూ, కారుని రయ్యిమని రాష్ట్రంలోకి దూయాబోతోంది. ఇక ఈ నిర్ణయం ప్రభావం తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో తెలియనుంటే పక్క రాష్ట్రంలో ఉన్న మన తెలుగు తమ్ముళ్ల మీద మాత్రం దాని ప్రభావం వెంటనే పడింది. ఇదేమి విడ్డూరం అని వెనక్కి తిరిగి చూస్తే దేనికి కారణం మన సీనియర్ మాజీ రాజకీయవేత్త లగడపాటి రాజగోపాల్ అని తేలింది. అసలు ఎంటి ఈ తతంగం అని తెలుసుకోవాలంటే కళ్ళు కిందకు జరపాల్సిందే. 

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతోనే గట్టెక్కింది. అలాంటిది రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్... ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అధికారాన్ని కూడా పూర్తి చేయలేక ముందస్తుకు పోయాడంటూ విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.  తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే లగడపాటి సర్వే కూడా చివరి నిమిషంలో మహా కూటమి సాధించబోతోంది అని తెలిసిన ఒక సామాజిక వర్గం వారు వేలకు వేలు, లక్షలకు లక్షలు కూటమి పైన బెట్టింగ్ లు కాశారు. ఇక మంగళవారం వెళ్లి డబ్బులు దండుకుందాం అన్న సమయంలో మొదటి  గంటలోనే మొహం తెలేశారు.
 Image result for lagadapati
లగడపాటి సామాజికవర్గానికి చెందిన వీరంతా విస్తుపోయెలా చేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ సీఎం అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబుదే. రాష్ట్రంలోని పరిస్థితిని ముందే పసిగట్టిన బాబు తన సామాజిక వర్గానికే చెందిన లగడపాటి కాస్తా బాబు మాట చెవినపడిందే తడవుగా క్షణ కాలం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగేసి... అప్పటిదాకా తనకు తానుగా సర్వే చేసిన గణాంకాలను ఒక్కసారిగా మార్చేశారు.
Related image

ఇది తెలియక మన తెలుగు తమ్ముళ్లు నిండా మునిగిపోయారు. అయితే చంద్రబాబు పన్నిన ఆ వ్యూహంలో భాగంగా తన లెక్కలను తానే మార్చేసిన నిజం ఒక్క లగడపాటికి మాత్రమే తెలుసు. లగడపాటి మార్చిన లెక్కల మంత్రం చంద్రబాబుకు కూడా తెలుసనుకోవాల్సిందే. ఎందుకంటే... ప్రజల నాడిని పట్టడంలో చంద్రబాబు దిట్ట కింద లెక్కే కదా. కావున చంద్రబాబు ప్రజల మూడ్ మార్చేందుకు పన్నిన వ్యూహం ఆ సదరు సామాజిక వర్గానికి అర్థం కాలేదు. సర్వేలపై నిక్కచ్చి ఫలితాలను వెలువరిస్తారని భావించిన లగడపాటిని నమ్మినందుకు తామంతా మునిగిపోయామని ఇప్పుడు ఆ సామాజిక వర్గమంతా లబోదిబోమంటున్నారట. ఇప్పుడు వారంతా లగడపాటి ఎక్కడా అని గాలిస్తున్నరట. అసలు సూత్రధారిని వదిలేసి పాత్రధారి మీద పడితే ఏం వస్తుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: