కేంద్రంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఒక పెద్ద పవర్గా అల్లియన్స్ ను ఏర్పాటు చేసిన చంద్రబాబు అదే ఊపుతో తెలంగాణలో కూడా మహాకూటమి పేరుతో జోరుగా బరిలోకి దిగారు. కాంగ్రెస్తో కలిసి 12 సీట్లలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కేవలం రెండు స్థానాలు మినహాయించి మిగతా అన్నిచోట్ల వెనుకంజలో ఉంది. ఇక వారి ఓటమి అనివార్యం. ప్రజాకూటమిగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోతుంది. తెలంగాణలో వెల్లడవుతున్న ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణ ఓటర్లు టీడీపీ పార్టీని ఓ పట్టనా నమ్మినట్టు కనిపించడంలేదు.
Image result for chandrababu cunning

సత్తుపల్లి మరియు సండ్రా నియోజకవర్గాల్లో మాత్రమే టిడిపి గెలిచే అవకాశాలున్న నేపథ్యంలో మిగిలిన చోట్ల సైకిల్ కారు ధాటికి కుదేలవుతోంది. ఇందుకు కారణం చంద్రబాబుని తెలంగాణ ప్రజలు ఎప్పటినుండో ద్రోహిగా పరిగణించడం. అతనికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ఎప్పటి నుండో ఇష్టం లేకపోగా కనీసం ఉన్నన్ని రోజులు వారికి చేసిన అన్యాయాన్ని తలుచుకొని అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా అంతకంతకు బుద్ధి చెప్తూనే ఉన్నారు.
Related image
పేరుకే తెలుగుదేశం పార్టీ అయినా అతని పరిపాలన మొత్తం ఆంధ్ర దేశం కోసమే అన్నట్లుగా ఉంటుందని వీరు బలంగా విశ్వసిస్తారు. దాని ఫలితమే ఇప్పుడు ఎన్నికలలో కనబడింది.ఇక టీడీపీ ప్రతిష్టాత్మకంగా కూకట్ పల్లిలో నిలిపిన టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని కూడా వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచే ఆమె వెనుకంజలో ఉన్నారు. నందమూరి సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి అధిక్యతను కనబరుస్తున్నారు.
Related image
అదేవిధంగా శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకుపోతుంది.  అలాగే గత ఎన్నికల్లో టిడిపి నెగ్గిన సెటిలర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని చూపించడం విశేషం. తెలంగాణలో ఇటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఇక రాష్ట్రం గురించి లైట్ తీసుకోవడం మంచిదని విశ్లేషకులు అంటున్నారు. అయినా గులాబీ పార్టీ అక్కడ ఉన్నన్ని రోజులు పచ్చ జెండాను ఎట్టి పరిస్థితుల్లో ఎగరనివ్వదు అన్నది మాత్రం స్పష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: