అవును చంద్రబాబునాయుడుకు ఏపిలో కూడా డేంజర్ బెల్స్ మొదలయ్యాయి. అందుకు తెలంగాణా ఎన్నికలే నాంధిగా నిలిచాయి. ఎలాగంటే, తెలంగాణా ప్రజానీకం చంద్రబాబునాయుడు మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. తెలంగాణా ఎన్నికల్లో టిడిపి పోటీ చేసిన 12 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఆరు స్ధానాల్లో ప్రచారం చేశారు. అదే విధంగా మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్ధులు పోటీ చేసిన మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేశారు. విషయం ఏమిటంటే, చంద్రబాబు ప్రచారం చేసిన ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మహకూటమి అభ్యర్ధులెవరూ గెలవలేదు. విచిత్రమేమిటంటే, తెలంగాణాలో సీమాంధ్రుల ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కూడా మహాకూటమి అభ్యర్ధులు ఎక్కడా గెలవలేదు.

 Image result for chandrababu and mahakutami

వెల్లడైన ఫలితాలను బట్టి ఏమర్ధమవుతోంది ? చంద్రబాబు మాటలను తెలంగాణా జనాలే కాదు కనీసం సీమాంధ్రులు కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు తన ప్రసంగాల్లో కెసియార్ పై డైరెక్ట్ యటాక్ చేయటానిక భయపడింది వాస్తవం. అయితే, నరేంద్రమోడిని, ఫిరాయింపు ఎంఎల్ఏలను చిత్తు చిత్తుగా ఓడించమని మాత్రం గొంతు చించుకుని మరీ చెప్పారు. హైదరాబాద్ ను కట్టింది తానే అన్నారు. సైబరాబాద్ తన సృష్టే అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయాన్ని తానే నిర్మించానని అబద్దాలు కూడా చెప్పారు. అయినా జనాలు నమ్మలేదు, పట్టించుకోలేదు. చంద్రబాబు ఓడించమని చెప్పిన ఫిరాయింపులను జనాలు బ్రహ్మాండంగా గెలిపించారు.

 Image result for chandrababu and mahakutami

సనత్ నగర్ లో తలసాని శ్రీనివాసయాదవ్, జూబ్లిహిల్స్ లో మాగంటి గోపీనాధ్, కుకట్ పల్లిలో మాధవరం కృష్ణారావు, శేరిలింగం పల్లిలో ఆరెకపూడి గాంధి లాంటి వాళ్ళని ఓడించమని చంద్రబాబు నెత్తీ నోరు మొత్తుకున్నారు. అయినా జనాలు వాళ్ళని పెద్ద మెజారిటీతో గెలిపించారు. ఏపిలో 23 మంది వైసిపి ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయించేట్లు చేసిన చంద్రబాబు అదే ఫిరాయింపులను తెలంగాణాలో ఓడించమంటే జనాలు ఎలా ఒప్పుకుంటారు ? చంద్రబాబు ఎటూ చెప్పాడు కాబట్టి ఫిరాయింపు ఎంఎల్ఏలు, ఎంపిలను ఏపి ఎన్నికల్లో ఓడిస్తారేమో చూడాలి.

 Image result for chandrababu and mahakutami

తెలంగాణా ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపి ఎన్నికల్లో కచ్చితంగా పడతాయనటంలో సందేహం లేదు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఇఫ్పటికే అనేక వర్గాలు చంద్రబాబుపై మండిపోతున్నారు. చంద్రబాబుపై ఏపిలో మండిపోతున్న వర్గాల తాలూకు జనాలే తెలంగాణాలో మహాకూటమి అభ్యర్ధులకు వ్యతిరేక ఓటు వేశారు. కాబట్టి ఏపి ఎన్నికల్లో వారంతా కసితీరా తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.


అసలే, చంద్రబాబుపై  కాపులు, బిసిలు, బ్రాహ్మణులు, ముస్లింలు మండిపోతున్నారు. చంద్రబాబుపై మంటకు ఒక్కో సామాజికవర్గానికి ఒక్కో కారణముంది. ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. వ్యతిరేకంగా ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉన్నారని అనుకోవటానికి తెలంగాణాలో ఎన్నికల్లో వ్యతిరేకంగా పడిన సీమాంధ్ర ఓట్లే సాక్ష్యం. పై వర్గాలకు తోడు కొత్తగా 32 లక్షల నిరుద్యోగ యువత, యువత ప్రత్యేక బోనస్ గా తోడయ్యారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చంద్రబాబుకు డేంజర్ బెల్స్ తప్పేట్లు లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: