తుపానుల సంగతి వాతావరణ శాఖకు తెలుస్తాయి. రాజకీయ తుపానుల సంగతి తలపండిన రాజకీయ నాయకులకు ముందే తెలుస్తాయి. జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకుంటే జరగబోయేది ఏంటన్నది సులువుగానే అంచనా వేసేయవచ్చు. మరి తెలంగాణా ఫలితాలు రెండు  తెలుగు రాష్ట్రాల్లో రేపటి రాజకీయ ముఖ చిత్రాన్ని కళ్ల ముందు ఉంచుతున్నాయని అనుకోవచ్చా..


పరీక్ష అంటున్న బాబు :


తెలుగుదేశం ఎన్నో సంక్షోభాలను  ఎదుర్కొంది. ప్రతి సమస్యను సవాల్ గా తీసుకుంది. ఇపుడు కూడా అటువంటి సమయమే ఉంది. మనకిది పరీక్షా సమయం అని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ఓ విధంగా తెలంగాణా ఫలితాలు మధింపు చేసుకున్న తరువాత బాబు నోటి వెంట వచ్చిన మాటగా ఇది చెప్పుకోవాలి.  తెలంగాణా ఎన్నికల్లో టీడీపీకి దారుణమైన అవమానం జరిగింది. మొత్తం టీడీపీ పుట్టె మునిగింది. దానికి తోడు ఆ ప్రభావం ఏపీ మీద పడనుందా అన్న ఆందోళన తమ్ముళ్ళలో ఉంది. ఈ సమయంలో బాబు ఈ వ్యాఖ్యలు  చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


అందరూ దాడి చేస్తున్నారు:


విశాఖ జిల్లా టూర్లో  చంద్రబాబు అనేక సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అభివ్రుధ్ధి కంటే రాజకీయ అంశాలే ఎక్కువగా ప్రస్తావించారు. ఓ వైపు కేంద్రంలోని మోడీ, మరో వైపు వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్, ఇక కొత్తగా టీయారెస్ అధినేత కేసీయార్ అంతా కలసి టీడీపీపై, మూకుమ్మడి  దాడి చేస్తున్నారని బాబు వాపోయారు. మరీ ముఖ్యంగా ఏపీలో వైసీపీ సహకరించడంలేదని బాబు విరుచుకుపడ్డారు. పవన్ సైతం మోడీని విమర్శించకుండా తననే అనడంలో  అర్ధమేంటని కూడా బాబు నిలదీశారు.


ఆందోళన‌కు సంకేతమా:


బాబు ఇలా ఓపేన్ గా ఇది పరీక్షా కాలం అంటూ బయటపడడం అంటే సాక్ష్తాత్తూ అధినేతే ఆందోళనలో ఉన్నారని అర్ధమవుతోంది. బాబు ఓ వైపు బీజేపీ ఉత్తరాదిన ఓడిపోయిందని చెబుతున్నా  పక్కనున్న తెలంగాణాలో టీడీపీ ఓటమి పాలు కావడం ఆయనకు మింగుడు పడడంలేదని అంటున్నారు. పైగా మరో నాలుగైదు నెలల్లో జరిగే ఏపీ ఎన్నికల్లో ప్రజా వ్యతితేకత బాగా ఉంటుందన్న ఆలొచనలే ఇపుడు ఆయన చేత ఈ మాటలు అనిపించాయనుకోవాలి. ఏదేమైనా చంద్రబాబు పరీక్షా  సమయం అంటూ చెప్పాక టీడీపీ వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం అగ్ని పరీక్షా అని   తమ్ముళ్ళు కూడా అనుకోకతప్పదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: