చంద్ర బాబు బీజేపీ నుంచి బయటికి రావడంతో అందరూ మోడీ ఏమన్నాడని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది . అయితే బాబు గురించి  భాజపాకు, మోడీకి కూడా అనుభవమైనా కూడా సామాజిక బంధాలతో కొందరు 'పెద్దలు' వత్తిడి చేయడంతో మరోసారి పొత్తు పెట్టుకోక తప్పలేదు. అయితే అలా పొత్తు పెట్టుకున్నపుడే మోడీకి తెలుసంట. బాబు ఎప్పటికైనా మోసం చేసి, హ్యాండ్ ఇస్తారని. ఈ విషయం గాలివార్తే కానీ, ఎవరో పుట్టిస్తే పుట్టింది కాదు. బాబుగారు, ఆయన తెలుగు తమ్ముళ్లు నమ్మే మీడియా పుట్టించిన వార్తే.

Image result for narendra modi

ఎవ్వరైతే సామాజిక బంధాలతో బాబుగారిని, మోడీని దగ్గర చేసారో, సదరు 'పెద్దాయన'తోనే మోడీ అన్నారట. ఇలా చేస్తారు చంద్రబాబు అని తెలుసు. కానీ ఆయన వ్యవహారాన్ని ఆంధ్రలోని మనవాళ్లు తిప్పి కొట్టలేకపోయారు అని అన్నారట. పాపం, చంద్రబాబు మోసం సంగతి తెలుసు కానీ, మోడీ గారికి ఆంధ్ర భాజపా సంగతి తెలియదు. మోడీ మాట్లాడిన ఆ 'పెద్దాయినే' చిరకాలంగా ఆంధ్ర భాజపాను తెలుగుదేశం పార్టీ 2 అన్నట్లు తయారుచేసారని, తమ సామాజిక బంధాలున్న వారికే కీలక పదవులు కట్టపెట్టారని, వారంతా బాబుకు తందాన తాన అంటారు.

Image result for chandrababu

అవసరం అయితే పార్టీ వదిలేస్తారు కానీ, పార్టీని రక్షించే బాపతు కాదని మోడీకి తెలియదు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత సదరు పెద్దయిన 'భాజపా' కంట్రొల్ స్విచ్ తన చేతిలోకి తీసుకుని, సంప్రదాయ హిందూత్వ వాదులందరినీ దూరంచేసి, రాజకీయ అవకాశ వాదులతో పార్టీని నింపేసారని, అందుకే ఆ పార్టీ ఆంధ్రలో ఎదగడం లేదని మోడీ ఎప్పుడు తెలుసుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి: